CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాయుధ పోరాట స్పూర్తితో ప్రజాసమస్యలపై ఉద్యమిద్దాం.

Share it:

 



నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణసాయుధ రైతాంగ పోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులే


సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా సాయుధ పోరాట అమరవీరుల స్మారక దినోత్సవం.


మన్యం టీవీ పాల్వంచ:-


తెలంగాణ రైతాంగం సాయుధ పోరాటం స్పూర్తితో ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రజాసమస్యలపై ఉద్యమిద్దాంని *సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టీ పూర్ణచంద్రరావు* అన్నారు. రైతాంగ సాయుధ పోరాటంకు పిలుపునిచ్చిన రోజు సందర్భంగా  సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్మారక దినోత్సవాన్ని నిర్వహించారు. తొలిత *అరుణ పతాకాన్ని మాజీ పట్టణ కార్యదర్శి బాగం రాంప్రసాద్ ఆవిష్కరించారు*. అనంతరం అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, పేద ప్రజలపై గడిలలో పెత్తం దారుల అరాచకత్వంకు వ్యతిరేకంగా, 1947 ఆగస్టు 15 భారత దేశంకు స్వాతంత్య్రం వచ్చిన నిజాం నవాబు తెలంగాణ సంస్థానాని భారతదేశంలో విలీనం చేయకుండా ఈ ప్రాంత ప్రజలను పన్నుల రూపంలో, మహిళలపై దాడులు, హింసలకు గురిచేసేవారని అన్నారు. వారి అరచకత్వలకు వ్యతిరేకంగా *1947 సెప్టెంబర్ 11న రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మఖ్దూమ్ మోహినుదీన్* నాయకత్వంలో తెలంగాణా సాయుధపోరాటం నిర్వహించింది కమ్యూనిస్టులు అని స్పష్టం చేశారు. దున్నేవానికి భూమి కావాలని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీవిముక్తి కోసం పోరాటం కొనసాగించింది కమ్యూనిస్టులేనని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమినీ పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందన్నారు. సాయుధ పోరాటంలో సుమారు 4వేల ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయారుని, ఎందరో త్యాగధనుల బలిదానాలు వల్ల నేటి ఈ తెలంగాణా అని అన్నారు. *ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు వీసంశెట్టీ విశ్వేశ్వరరావు సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఉప్పుశెట్టి రాహుల్, సీపీఐ, ప్రజాసంఘాలు నాయకులు అన్నరపు వెంకటేశ్వర్లు, మడుపు ఉపేంద్ర చారి, శ్రీరాములు, నాగమల్ల సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, రవి, వెంకన్న, రాంబాబు* తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: