CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు నివాస గృహాలు కేటాయించాలి

Share it:

 


      


ఐ.ఎఫ్.టి.యు నాయకులు మంగీలాల్ డిమాండ్


మన్యం టీవీ మణుగూరు:

సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను,కాంట్రాక్ట్ కార్మికులకు,ప్రైవేటు వాహనాల డ్రైవర్లకు, ప్రైవేటు సెక్యూరిటీ గార్డులకు,ఆయా నిష్పత్తుల్లో కేటాయించాలని,ఐ.ఎఫ్.టి.యు మణుగూరు ఏరియా నాయకులు మంగీలాల్ సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.జీతం తక్కువ సొంత ఇల్లు లేదు,ఆ వచ్చిన తక్కువ జీతం నుండి నిత్యావసర వస్తువులకు పోను,ఇంటి కిరాయి కట్టాలంటే కాంట్రాక్ట్ కార్మికులకు చుక్కలు కనపడుతున్నాయని,ఈ నేపథ్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు క్వార్టర్స్ ను కేటాయించాలి అని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం లో భాగంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా ఆదివారం ఉదయం స్థానిక *ఎస్ఎంఎస్* ప్లాంట్లు కాంట్రాక్ట్ కార్మికుల తో కలిసి ఆయన మాట్లాడారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని, మణుగూరు తో పాటు అనేక ఏరియాలలో ఎన్నో క్వార్టర్స్ ఖాళీగా పడి ఉన్నాయని,అలా ఖాళీగా ఉన్న క్వార్టర్ లను కాంట్రాక్ట్ కార్మికులకు,ప్రైవేటు కన్వినెన్స్ వాహనాల డ్రైవర్లకు,ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కేటాయిస్తే,ఎన్నో ఏండ్లు తపస్సు చేస్తే దేవుడు ప్రత్యక్షమై తాము కోరుకున్న వరం ఇస్తే భక్తుడు ఎంతగా సంతోషిస్తాడో,కాంట్రాక్ట్ కార్మికులు కూడా అంతగా సంతోషిస్తారని,ఆయన తమ భావాల్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎంఎస్ కాంట్రాక్ట్ వర్కర్స్ బాలకృష్ణ, రఘు,వెంకటేశ్వర్లు,కృష్ణ,శ్రీనివాస్,మధుసూదన్ రావు, వినోద్ కుమార్,వీరారెడ్డి,పి. సత్యనారాయణ,జె.రాజేష్,ఎం.మాధవరావు,ఎన్.వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: