CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా రైతాంగం తల పెట్టిన భారత్ బంద్ జయప్రదం చేయండి

Share it:

 


👉న్యూడెమోక్రసీ పార్టి రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ పోటు రంగారావు పిలుపు✊✊✊

మన్యం మీడియా/అశ్వారావుపేట నియోజకవర్గ ప్రతినిధి:: న్యూడెమోక్రసీ (ఎన్డీ) పార్టీ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు. ములకలపల్లి మండలం, కొత్త జిన్నెలగూడెం గ్రామంలో మండల కమిటి ఆద్వర్యంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ, ఆల్ ఇండియా కిషన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏ.ఐ.కె.ఎస్.సి.సి) నాయకత్వంలో రైతాంగం ఎదుక్కోంటున్న అన్ని సమస్యలను పరిష్కరించాలని,కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని.గత 9 నెలలుగా ఢిల్లీ సరిహాద్దులలో పోరాటాలు చేస్తున్న, కేంద్ర ప్రభుత్వం మాత్రం తను చేసిన తప్పులను సరిదిద్దు కోకుండా ఉద్యమాన్ని ఎలా అణిచివేయాలనే కుట్రలు చేస్తుందని అన్నారు.దేశ వ్వవసాయ రంగాన్ని బ్రస్టూ పట్టిస్తూ...వ్వవసాయ వనరులను మొత్తం అదాని,అంబానీ లకు అప్పజపుతుందని,టిఆర్ఎస్ ప్రభుత్వం మొదట ఈ మూడు వ్వవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పినా, ప్రస్తుతం మౌనంగా ఉంటూ మోడీ లకు లొంగిపోయిందని. అందుకే కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా,అన్ని రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 27 జరప తలపెట్టిన భారత్ బంద్ లో అన్ని వర్గాల ప్రజలు పాల్గోని విజయవంతం చేసి, వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని కోరారు.

ఈ సమావేశంలో సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి-కెచ్చెల రంగారెడ్డి,సిపిఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు-ముద్దా బిక్షం,కె కల్పన,ఎండి గౌస్, అమర్లపూడి రాము,నూపా భాస్కర్,కల్లూరి కిషోర్,పోతుగంటి లక్ష్మణ్,ఎస్ రామారావు,ఎన్ రాంబాబు,జి ప్రభాకర్,కె కల్లయ్య, కుంజా కృష్ణ,రాచన్నగూడెం సర్పంచ్-కొర్సా గణపతి,ఎంపిటిసి-విజయ, తదితర నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: