CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మెగా కోవిడ్ సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం లో పాల్గొని విజయవంతం చేసిన సింగరేణియులందరికి ధన్యవాదాలు

Share it:

 



మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి. ప్రభాకర రావు                                  


మన్యం టీవీ మణుగూరు: కోవిడ్ కట్టడిలో భాగంగా టిబిజికేయస్ చొరవతో సింగరేణి యాజమాన్యం ఆదివారం నాడు మణుగూరు సింగరేణి సి.ఈ ఆర్ క్లబ్ నందు నిర్వహించిన సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ను విజయవంతం చేయాలని కోరుతూ,మణుగూరు టిబిజికేయస్ ఇచ్చిన పిలువులో భాగంగా ఏరియా లోని అన్ని గనుల్లో,డిపార్ట్ మెంట్ లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులతో పాటు,కార్మిక కుటుంబ సభ్యులు,ఔట్ సోర్సింగ్ కార్మికులు సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకొని మెగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను మణుగూరు టిబిజికేయస్ బ్రాంచి ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర రావు హృదయ పూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరో వారం రోజుల పాటు కొనసాగించే విదంగా స్థానిక ఏరియా జనరల్ మేనేజర్ జక్కం.రమేష్ ను కోరిన వెంటనే టిబిజికేయస్ చేసిన విజ్ఞప్తి మేర వ్యాక్సిన్ ప్రక్రియ పొడగింపు పై సానుకూలంగా స్పందించి అనుమతులు అందించారని,ఈ అవకాశాన్ని ప్రతి కార్మికుడు, వారి కుటుంబ సభ్యులు మరియు ఔట్ సోర్సింగ్ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన వారందరికి ఎటువంటి అసౌకర్యం తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేసి,కార్యక్రమం విజయవంతం చేయడం లో విశేష కృషి చేసిన ఏరియా జనరల్ మేనేజర్ జక్కం. రమేష్ కు,వైద్య బృందం కు, ప్రత్యేకంగా,పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మణుగూరు టిబిజికేయస్ తరువున ధన్యవాదాలు తెలిపారు.వ్యాక్సిన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ డాక్టర్ సూచించిన ఆరోగ్య నియమ నిబంధనలు తప్పనిసరి పాటించాలని కోరారు.వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ తప్పనిసరి ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి,కోవిడ్ నిబంధనలు పాటిస్తూ,కోవిడ్ రహిత మణుగూరు సింగరేణి గా తీర్చిదిద్దలని తెలియజేశారు.

Share it:

Post A Comment: