CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అప్పీల్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాస్కులు మరియు శానిటైజర్ ల పంపిణీ

Share it:

 


 మన్యంటీవి, అశ్వరావుపేట:

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, నారాయణపురం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో "అప్పీల్" స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సుమారు 120 మందికి ఒక్కొక్కరికి మూడు మాస్కులు ఒక శానిటైజర్ చొప్పున మొత్తం 360 మాస్కులు 120 శానిటైజర్లు ఉచితంగా అందజేయడం జరిగింది. సింగరేణి సంస్థ అందించిన పూర్తి ఆర్థిక సహకారంతోనే ఈ మాస్కులు శానిటైజర్ ల పంపిణీ జరుగుతోందని అప్పీల్ సంస్థ అధ్యక్షులు శ్రీ గోళ్ళ రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ గోళ్ళ రమేష్ మాట్లాడుతూ తమ సంస్థ మరియు సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అభ్యర్థన మేరకు సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లో భాగంగా ఒక లక్ష రూపాయల విలువ కలిగిన 3,600 మాస్కులు మరియు 1200 శానిటైజర్లు కొనుగోలు చేసి వాటిని ములకలపల్లి మండలం, దమ్మపేట మండలం మరియు అశ్వారావుపేట మండలంలోని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఎవరైనా డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువుకున్న యువతీ యువకులు ఎవరైనా స్వచ్ఛందంగా పదో తరగతి లోపు విద్యార్థులకు ట్యూషన్ చెప్పడానికి ముందుకు వస్తే ఆ గ్రామంలో స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి వారికి ఐదు వేల రూపాయల విలువైన స్టడీ టేబుల్, చైర్, బ్లాక్ బోర్డ్, గురుకుల ప్రవేశ పరీక్ష పుస్తకాలు, నవోదయ ప్రవేశ పరీక్ష పుస్తకాలు, ఇంగ్లీష్ పెంపొందించుకోవడానికి కావలసిన మెటీరియల్, డిక్షనరీ తదితర సామాగ్రిని ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరేణి డిప్యూటీ జనరల్ మేనేజర్ పర్సనల్ శ్రీ ధన్పాల్ శ్రీనివాస్ హాజరయ్యారు. అదేవిదంగా స్కూల్ ఎంఈవో కృష్ణయ్య అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ కంగాల పరిమేష్, జడ్పిటిసి శ్రీమతి చిన్నంశెట్టి వరలక్ష్మి , అశ్వారావుపేట పీఎస్ఆర్ ట్రస్ట్ నిర్వాహకులు జక్కుల రాంబాబు, ఎస్ఎంసి కమిటీ చైర్మన్ శ్రీనివాస రావు, స్థానిక గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వర రావు, పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా సింగరేణి పర్సనల్ మేనేజర్ బేతి రాజు, సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సభ్యులు సుమన్ ,సాయి కృష్ణ , సింగరేణి పర్సనల్ డిపార్ట్మెంట్ మరియు ఉపాధ్యాయ సిబ్బందితో పాటు వంద మంది స్కూలు విద్యార్థులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: