CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ముర్రేడు వాగుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టండి.

Share it:


👉కరకట్ట లేకపోవడం వల్లే వాగు కోతకు గురై నష్టపోతున్న ప్రజలు.

👉సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.

👉ముర్రేడు వాగు పరివాహక ప్రాంతాల్లో పర్యటించిన సిపిఐ బృందం.

భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 10 (మన్యం టీవీ) కొత్తగూడెం*

: ముర్రేడు వాగుకు ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టి ముంపుకు గురవుతున్న ప్రాంతాలను ప్రజలకు రక్షణ కల్పించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్ కె. సాబీర్ పాషా కోరారు. కొత్తగూడెం పట్టణం, లక్ష్మిదేవిపల్లి మండల పరిధిలోని ముర్రేడు వాగు పరివాహక కాలనీలు, బస్తీలు, గ్రామాలలో శుక్రవారం సిపిఐ ప్రతినిధిబృందం పర్యటించింది. వాగు ఉదృతికి ముంపుకు గురై నష్టపోయిన పలు కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఏటా వర్షాకాలంలో ముర్రేడు పరివాహక ప్రాంతాలు ముంపుకు గురై ప్రజలు ఇండ్లు కోల్పోతున్నారని, భారీ స్థాయిలో ఆస్థి నష్టం సంబవిస్తోందన్నారు. వాగు కోతకు గురికావడంతో కాలనీలతోపాటు, హిందూ స్మశాన వాటిక, కబ్రస్థాన్లు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఇప్పటికే 30 అడుగుల మేర వాగు కోతకు గురైందని, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పది గృహాలు నేలమట్టమయ్యాయని, అనేక ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయన్నారు. ప్రతీయేటా ఇదే పరిస్థితి నెలకొంటున్నప్పటికి పాలకులు, అధికార యంత్రాంగం స్పందించకపోవడం దుర్మార్గమైందన్నారు. అశోక్ నగర్ సమీపంలోని మామిడి తోట నుంచి గాజులరాజం బస్తి వరకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి యుద్ధ ప్రాతిపదికన కరకట్ట నిర్మాణం చేపట్టడం ద్వారా కాలనీలు, బస్తీలు, గ్రామాలను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రతినిధి బృందంలో ముర్రేడు పరివాహక ప్రాంతాల పార్టీ నాయకులు పాషా, ప్రసాద్, యాకయ్య, లింగయ్య, బుచ్చయ్య, తాజుద్దీన్, శ్రీను, వరలక్ష్మి తదితరులు ఉన్నారు.

Share it:

Post A Comment: