CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఐటీయు రాష్ట్ర జాతను జయప్రదం చేయండి:సీఐటీయు బ్రాంచ్ కమిటీ పిలుపు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సీఐటీయూ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో కార్మిక గర్జన జాతాలను జయప్రదం చేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ బ్రాంచి కమిటీ పిలుపునిచ్చింది. సిరాజ్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల చట్టాలను తుంగతొక్కి కార్మికులతో వెట్టి చాకిరీ చేస్తున్నాయని అన్నారు, కేంద్రం 44కార్మిక చట్టాలను రద్దు చేసి 4కోడ్లు తెచ్చిందని,ప్రభుత్వ రంగ సంస్థలు కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతున్నదని,రాష్ట్ర ప్రభుత్వం అదేబాటన పయనిస్తున్నదని అన్నారు.సింగరేణిలో పర్మినెంట్ కార్మికుల స్థానే ప్రై వేటు కార్మికులను తీసుకొస్తున్నదనీ అన్నారు.సింగరేణి సంస్థ ను కాపాడుకోవడం కోసం, కార్మికులు సంక్షేమం కోసం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో కార్మిక గర్జన యాత్రను ఈ నెల 13న భూపాల పల్లి నుండి ప్రారంభం చేస్తున్నట్లు ఆ యాత్ర 18 రాత్రికి ఇల్లందు చేరుకుని 19 న పిట్స్ మైన్ ఓసీ, ఇల్లందు లో పనిచేస్తున్న షెడ్యూల్ కార్మికులను కూడా కలిసి వారి సమస్యలు తెలుసుకుని సమస్యల పరిష్కారం కోసం దశలవారీ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దశలవారీ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర నాయకులు కూకట్ల శంకర్,బ్రాంచి కార్యదర్శి లక్ష్మీ నారాయణ, సిరాజ్ అహ్మద్, సీఐటీయూ ప్రాంతీయ కన్వీనర్ అబ్దుల్ నబి, నల్లి నర్సయ్య,వీరయ్య, కృష్ణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: