CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సాంస్కృతిక విప్లవ సేనాని కామ్రేడ్ మావో

Share it:

 


👉 సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ

కార్యదర్శి మోర రవి


మన్యం టీవి, పినపాక:

అర్ధ వలస అర్థ భూస్వామ్య చైనా దేశంలో మార్క్సిజం- లెనినిజాన్ని నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి సాంస్కృతిక విప్లవాన్ని నడిపి ఆ దేశంలో విప్లవాన్ని విజయవంతం చేసి కామ్రేడ్ మావో జెడాంగ్ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిచారనీ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు 

మార్క్సిస్టు మహోపాధ్యాయ డు కామ్రేడ్ మావో 45 వ వర్ధంతి సభ పినపాక మండలం బయ్యారం గ్రామంలో ఎల్ అలివేలు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో మోర రవి పాల్గొని మాట్లాడారు. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, వర్గాలు లేని సమ సమాజం కోసం మార్క్సిజం సిద్ధాంత వెలుగులో దళారీ బూర్జువా, పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా శ్రామిక రాజ్యం స్థాపన రష్యా దేశంలో లెనిన్ నాయకత్వంలో 1917 అక్టోబర్ విప్లవం విప్లవం విజయవంతమైన తరువాత చైనాలో కామ్రేడ్ మావో నాయకత్వం మార్క్సిజం లెనినిజం సిద్ధాంతాన్ని మరింత సృజనాత్మకంగా అభివృద్ధి చేసి అతివాద మితవాద ముఖ్యంగా మితవాద రివిజనిస్టు విధానాలకు వ్యతిరేకంగా మావో సాగించిన సైద్ధాంతిక పోరాటం ప్రపంచ విప్లవోద్యమంలో పెడ ధోరణులనధోరణులకు వ్యతిరేకంగా విరామం లేకుండా పోరాడారన్నారు తుదిశ్వాస విడిచే వరకు ఆ దేశ నిర్దిష్ట పరిస్థితులకు అన్వయించి దీర్ఘకాలిక ప్రజాయుద్ధ  పంధా లో సాంస్కృతిక విప్లవాన్ని కొనసాగించి అసామాన్య ప్రాణ త్యాగాలతో లాంగ్ మార్చ్ నిర్వహించి చైనా దేశాన్ని విముక్తి  చేసి ప్రజా ప్రభుత్వాన్ని స్థాపించి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారని అన్నారు 

కామ్రేడ్ మావో భారతదేశంలో  పరిస్థితులను అధ్యయనం చేసి "మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానం" వెలుగులో భూమి భుక్తి భారతదేశ విముక్తి కోసం వ్యవసాయక విప్లవమే ఇరుసుగా నూతన ప్రజాస్వామిక విప్లవం లక్ష్యంగా కొనసాగుతున్న ప్రతిఘటన పోరాటాలను కొనసాగించాలని చెప్పారన్నారు మావో చూపిన మార్గంలో మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానాన్ని ఆచరణను అన్వయించుకుని బలమైన విప్లవోద్యమ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు గద్దల సమ్మయ్య , సాధు శ్రీను, పెద్దాడ లక్ష్మి , పట్ర ముసలమ్మ, నారిపోగు శిరీష , ఆవుదొడ్డి ఎల్లయ్య , ఆవుదొడ్డి మారయ్య, నరసింహ , నడ్డి స్వరూప , మరస బుజ్జమ్మ , నవీన్ , లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: