CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మోగిన బడిగంట...

Share it:

 


తెరుచుకున్న తరగతి గది తలుపులు...



మన్యం టీవీ : జూలూరుపాడు, సెప్టెంబరు 1, కరోనా మహమ్మారి విద్య వ్యవస్థ పై తీవ్ర ప్రభావం చూపింది. తరగతి గదుల్లో విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన బాల బాలికలు సుమారుగా 15 నెలలపాటు బడులకు దూరమయ్యారు. ఆన్లైన్ విద్య వారిని అయోమయానికి గురి చేసింది. నేర్చుకున్న అక్షరాలను మరిచిపోయే పరిస్థితినే తీసుకొచ్చింది. చివరకు విద్యార్థుల భవితకు అడ్డుగా మారింది. ఎట్టకేలకు మహమ్మారి ప్రభావం తగ్గడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో బుధవారం మూగబోయిన బడిగంట జూలూరుపాడు మండల వ్యాప్తంగా మోగింది. మూతపడిన ప్రభుత్వ, ప్రైవేట్, అంగన్వాడి, పాఠశాలల తరగతి గది తలుపు తెరుచుకున్నాయి. ప్రారంభమైన మొదటి రోజు ఆర్డీవో స్వర్ణలత స్థానిక తహశీల్దార్ లూధర్ విల్సన్ తో కలిసి జూలూరుపాడు, మరియు కాకర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పడమట నర్సాపురం జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు ఉపాధ్యాయులు, హాజరైన విద్యార్థులచే స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. గుండెపుడి గ్రామపంచాయతీ లోని అంగన్వాడి సెంటర్ నందు ఎంపీపీ సోనీ, ఎండిఓ చంద్రశేఖర్, సర్పంచ్ నరసింహారావు, పిల్లలకు పాలను అందజేశారు.

Share it:

Post A Comment: