CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులను పాఠశాలలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి

Share it:

 



*దగ్గరుండి మరీ అల్పాహారం వడ్డన

* ఎంపీపీ గుమ్మడి గాంధీ

మన్యం మనుగడ, పినపాక: 


పాఠశాలలు, అంగన్వాడి లు సెప్టెంబర్ 1 న తెరుచుకున్న సందర్భంగా, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, పినపాక గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ఉదయం 9 గంటలకే అంగన్వాడి వద్దకు వెళ్లి, శానిటేషన్ కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు కాబట్టి ఎలాంటి అంతరాయం లేకుండా,

మాస్కులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలని, అంగన్వాడీ టీచర్ కు తెలియజేయడం జరిగింది. అనంతరం పిల్లల కొరకు తయారు చేసిన అల్పాహారమును పినపాక మండల ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చింత పంటి సత్యం తో కలిసి, దగ్గరుండి వడ్డించడం జరిగింది. అనంతరం పినపాక మండల ఉన్నత పాఠశాలను పరిశీలించి, విద్యార్థుల హాజరు శాతం గురించి, ప్రధానోపాధ్యాయుడు నుండి వివరాలు అడగడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పినపాక పంచాయతీ సర్పంచ్  

గొగ్గల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ నాయకులు నరసింహారావు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, అంగన్వాడి టీచర్లు పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: