CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చిన్నారి చైత్ర పై జరిగిన అత్యాచారంను ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ ప్రదర్శన

Share it:

 





 మన్యం టీవీ చర్ల:

హైదరాబాద్ పరిధిలోని సైదాబాద్ సింగరేణి కాలనీ లోని గిరిజన పాప అయినా చైత్ర( 6) పై హత్యాచార సంఘటను ఖండిస్తూ నిరసనగా దిశ  వెల్ఫేర్ ప్రొడక్షన్ మండల అధ్యక్షులు కొడారి కళ్యాణి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో శాంతి యుత ర్యాలీ చర్ల బస్టాండ్ సెంటర్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళ్యాణి మాట్లాడుతూ మహిళల కోసం ఎన్ని చట్టాలు ఏర్పడిన ఇలాంటి సంఘటనలు దేశం లో ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఈ చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తే నిందితులు తప్పించుకునే మార్గం ఉండదని, కానీ నిందితులు రాజకీయ నాయకుల సహకారంతో మరియు  డబ్బు ఎక్కువ ఉన్నదన్న అహంకారంతో  తప్పించుకుంటున్నారు. కావున ప్రభుత్వం తొందరగా స్పందించి చైత్ర పై జరిగిన సంఘటనకు కఠినంగా నిందితుని శిక్షించాలని, వీలైతే ప్రజల సమక్షాన ఉరి తీస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దిశ ఫౌండేషన్ సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: