CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 36 వ వర్ధంతి వేడుకలు చర్ల

Share it:

 



 మన్యం టీవీ చర్ల:

ఈరోజు  చర్ల మండలం రజక వృత్తిదారుల సంగం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి వేడుకలు పాత చర్ల గాంధీ బొమ్మ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల మండల రజక సంగ నాయకులు సంతుపురి సురేష్ ,రెగల్ల సుధాకర్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ రైతాంగ భు విముక్తి కోసం పోరాడినాటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ని అన్నారు. ఇదే కాకుండా తెలంగాణ రైతాంగ పోరాట ఉద్యమం లో అగ్రకులల స్త్రీలు, దొరసనులు తమను కూడా దొర అని ఉత్పత్తి కులాల చేత పిలిపించుకునే సంస్కృతికి శ్రమ గీతం పడిన వారిలో చాకలి ఐలమ్మ ముందంజలో ఉన్నారు అని అన్నారు. ఓరుగంటి మల్లమ్మ సాయి లకు నాలుగో సంతానం గా చాకలి ఐలమ్మ సెప్టెంబర్ 26,1895 కృష్ణాపురం గ్రామంలో, రాయపర్తి, వరంగల్ జిల్లా లో జన్మించింది అని, తెలంగాణ రైతాంగ సాయుధ భు పోరాటంలో తనదైన శైలిలో దొరల ఆగడాలను అరికట్టి విరోచింతంగా పోరాడి 10 లక్షల ఏకరాలకు పైగా భూమి నీ పేద ప్రజలకు పంచినటువంటి ఘనత చాకలి ఐలమ్మది అని కొనియాడారు.ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకొనే పోరాడాలి అని అన్నారు.ఇంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజకుల కు ఉచిత కరెంట్ ఏ కాకుండా రజిక వృత్తిదారుల మరణిస్తే వారియొక్క కుటుంబాలకు 10 లక్షల రూాయలతో ఎక్స్ప్రెషన్ ప్రకటించాలి అని అన్నారు. ఇప్పటికీ రజక వృత్తిదారుల పై దాడులు జరుగుతున్నాయి అని వీటిని తక్షినమే అరికట్టాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చర్ల మండల రజక సంగ నాయకులు సంతూపురి రఘువంశి, వేములవాడ సావిత్రి, సంతుపూరి రమణ, రెగళ్ళ వెంకట రమణ, చర్ల మండల బిజెపి అధ్యక్షులు గునురి రమణ , పొనగంటి సడలు,సోయం నగేష్,చింతూరు వినోద్ కుమార్, ఇతంరజు రాంబాబు,పటేల్. వెంకటేశ్వర్లు,పున్నం.సుధాకర్, యాకూబ్, పోనగంటి కళావతి,సంతుపురీ. భాగ్యవతి, దొడ్డిశ్రీను,వనపల్లిశ్రీరామ్ మూర్తి,అన్నంకృష్ణ, కుడికందులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: