CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

100కల ఆస్పత్రికి వైద్యులను నియమించాలి

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

 ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ బృందం..రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మై పతి.అరుణ్ కుమార్. రాష్ట్ర ప్రచార కార్యదర్శి అలెం.కోటి లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని వంద పడకల హాస్పటల్ ని సందర్శించడం జరిగింది. 


2014 సంవత్సరంలో వంద పడకల హాస్పిటల్ గా ప్రభుత్వం గుర్తించిన అనంతరం, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి వచ్చిందన్నారు.


స్థూల నిర్మాణం కనిపిస్తుంది తప్ప ఈ ఆస్పటల్ లో ఎటువంటి వైద్య సేవలు  పూర్తి స్థాయిలో అందటం లేదు అన్నారు. తెలంగాణ వస్తే హెలికాప్టర్ లో వైద్య సేవలు అందిస్తాం అన్న ప్రభుత్వం కనీసం 100 పడకల హాస్పటల్ లో 24 గంటలు వైద్యం అందించే పరిస్థితి లేదు అన్నారు. నేటికీ ఇంకా ఆదివాసీలు సరి అయిన వైద్యం అందక కరకగుడేం మండలం అశ్వరావు పాడు గోతి కోయ గ్రామం లో,3 నెలల శిశువు  నాటు వైద్యం ఆశ్రయం పొంది, పేగు తెగి చనిపోయే సంఘటనలు 74 ఏళ్ల స్వతంత్ర భారత దేశం లో జరుగుతున్నాయి అంటే,  వైద్య అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జిల్లా స్థాయి మెడికల్ ఆపిసర్ నుండి, ఆశ వర్కర్ ల వరకు ఉన్న ఆరోగ్య వ్యవస్థ నిర్లక్ష్యం మూలంగానే నేడు స్త్రీ శిశు మరణాలు జరుగుతున్నాయి అన్నారు. పర్యవేక్షణ చేయటం లో అధికారుల విఫలం ఉంది అన్నారు. ఆరోగ్య శాక తో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ కల గలసి గర్భిణీలు శిశువులు పర్యవేక్షణ చేయాలని నిత్యం బాగోగులు పౌష్ఠిక ఆహారం అందించాలని నిబంధన ఉన్న ఎందుకు పట్టించుకోలేదు సమాధానం చెప్పాలి అన్నారు.


హాస్పిటల్ నీ సందర్శన చేసిన సమయం అధ్యయనం 2 గంటలు కానీ ఒక అటెందర్ గాని, స్టాప్ నర్సు కానీ, ఎంబీబీఎస్ డాక్టర్ గాని, రోగుల రిజిస్టర్ ఉద్యోగి కానీ, కానరాలేదు అని అన్నారు. ఇది హాస్పిటల్ న బందెల దొడ్డి న అని ప్రశ్నించారు.


వర్షా కాలం సమయం లో ఆదివాసీలు, విష జ్వరాలు,టైఫాయిడ్,మలేరియా, జాండిష్, డెంగ్యూ బారిన పడి మృత్యు వాత పడుతుంటే, ఈ హాస్పిటల్ నిర్మానుష్యంగా, ఉండటం ,వైద్య  శాఖ సోమరితనం కి నిదర్శనం అన్నారు. పెద్ద హాస్పిటల్ పరిస్థితిని చూస్తే ఇలా ఉంది అంటే ఇంకా ప్రైమరీ హెల్త్ సెంటర్ లలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందని అన్నారు. ఇదే సందు అని కార్పొరేట్ హాస్పిటల్స్ ఆదివాసీల రక్తం తాగుతున్నాయని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ పనిచేస్తే ఆదివాసీల అప్పుల బాధలు తప్పుతాయి అన్నారు.ఇప్పటికే అనేక రోగాలు నమోదు అయిన ఇంకా పట్టింపు ఎది అన్నారు. స్థానికంగా ఉండి వైద్యం చేయాల్సిన అధికారులు పట్టణాల నుండి రోజు ఆప్ అండ్ డౌన్ చేస్తూ నిబంధనలను అతిక్రమిస్తే కనీసం వారిపై చర్యలు లేవన్నారు


వెంటనే 24 గంటల వైద్యం ఈ హాస్పిటల్ ద్వారా అందించాలని, వైద్య సేవలు పెంచాలని అన్నారు,స్టాప్ నీ కూడా పెంచి వైద్య సేవలు అందించాలి లేదంటే దశల  వారీ ఉద్యమాలు చేస్తాం అణారు 


ఈ కార్యక్రమం లో ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు పాయం

పూర్ణ చందర్ రావు.చంద తరుణ్,సర్కార్ లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: