CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో వేల్పుల.వెంకన్న కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం

Share it:

 


*బాధిత కుటుంబానికి అండగా ఉంటాం సీఎంఓఏఐ అధ్యక్షులు జక్కం రమేష్

    

మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు సింగరేణి ఓ సి 2 లో ఈ నెల 18వ తేదీ బుధవారం మధ్యాహ్నం పీకే ఓ సి సెక్షన్ 2 లో జరిగిన డంపర్ బొలెరో వాహనం ప్రమాదంలో మృతిచెందిన ప్రైవేటు వాహన ఓనర్ కం డ్రైవర్ వేల్పుల.చిన్న వెంకన్న కుటుంబానికి మణుగూరు ఏరియా సింగరేణి అధికారుల సంఘం కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎంఓఏఐ అధికారుల నుంచి సేకరించిన లక్ష రూపాయల కొంత నగదు,కొంత చెక్కు రూపేణా మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట గ్రామంలో వెంకన్న ఇంటి వద్దనే మణుగూరు ఏరియా అధికారుల,కార్మిక సంఘాల,సి.పి.ఐ నాయకుల సమక్షంలో సింగరేణి స్థాయి అధికారుల సంఘం అధ్యక్షులు ఏరియా జిఎం జక్కం.రమేష్ చేతుల మీదుగా వెంకన్న భార్య సుజాత,పెద్ద కుమారుడు గణేష్,చిన్న కుమారుడు మహేష్,తల్లి గంగమ్మలకు నగదు మరియు చెక్కును అతిధుల చేతులమీదుగా అందజేశారు.వెంకన్న లేని లోటు తీర్చలేనిదని,ఉడతా భక్తిగా అధికారుల సంఘం ఆధ్వర్యంలో తొలివిడతగా లక్ష రూపాయలు అందజేస్తున్నామని,ఇంకా ఏరియా అధికారుల నుండి విరాళాల రూపంలో నిధులు సేకరిస్తున్నామని,త్వరలోనే ఆ సొమ్మును కూడా అందజేస్తామని అని తెలిపారు.వెంకన్న మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వెంకన్న కుటుంబానికి అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చారు.కుటుంబ సభ్యులను పరామర్శించి, వారినీ ఓదార్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఏరియా గుర్తింపు సంఘం ఇతర కార్మిక సంఘాల సహకారంతో సింగరేణి యాజమాన్యం నుండి ఏ మేరకు వీలైతే ఆ మేరకు సహకారం అందించే ప్రయత్నం చేస్తామని, అప్పటివరకు వెంకన్న పెద్ద కొడుక్కి తాత్కాలికంగా ఉపాధి చూపిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏరియా అధికారుల సంఘం అధ్యక్షులు డి.లలిత్ కుమార్,గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వి. ప్రభాకర్ రావు,సిపిఐ నాయకులు బి.అయోధ్య, అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు వీరాస్వామి, ఏ.ఐ.టి.యూ.సి,వి.వెంకటరత్నం,సిఐటియూ,వి.రవీందర్ రావు,బిఎంఎస్,ఎస్డి.నాసర్ పాషా,ఐ.ఎఫ్.టి.యూ,మాట్లాడుతూ ప్రమాద సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు.ప్రమాద సంఘటన అందరినీ కలచివేసిందన్నారు.ఏరియా సింగరేణి కార్మికుల నుండి కూడా తగు ఆర్థిక సహకారం అందించేలా వారితో మాట్లాడి వారిని కూడా ఒప్పిస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో అధికారుల సంఘం నాయకులు తాళ్లపల్లి. లక్ష్మీపతి గౌడ్,ఎం.నర్సిరెడ్డి, మాలోత్.రాముడు,ఎస్. రమేష్,షాభిరుద్దీన్,ఎండీ మదార్ సాహెబ్,ఏరియా కార్మిక సంఘాల నాయకులు కోట శ్రీనివాస్,డి.వీరభద్ర రావు,టిబిజీకేఎస్,వై.రామ్ గోపాల్ ఏ.ఐ.టీ.యూ.సి, శ్రీనివాస్,ఐ.ఎన్.టి.యు.సి,కుమార్ హెచ్ఎంఎస్,సరెడ్డి. పుల్లారెడ్డి,సర్వర్ సీపీఐ మంగీలాల్,ఐ.ఎఫ్.టి.యూ,బొగ్గు ముఠా కార్మికులు గంగరాజు,మల్లయ్య,శీను,బంధువులు మల్లయ్య, లింగయ్య,పద్మ,పలువురు అధికారులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: