CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వాలి

Share it:



  • పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వాలి
  • ఆదివాసీలపై ఫారెస్ట్ దాడులు అక్రమ అరెస్టులు ఆపాలి.
  • 2005 అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలి.
  • పోడు భూములు కాస్తు చేస్తున్న ప్రతి రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలి.
  • పోడు సాగు దారులపై ఫారెస్ట్ అధికారుల దాడులు ఆపాలి.
  • పోడు సాగు దారులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలి.
  • ఐటిడిఎ ఏపీఓ కు వినతి పత్రం అందించిన సంఘం నాయకులు.

మన్యం టీవీ ఏటూరు నాగారం

పోడు సాగు దారులకు పట్టాలివ్వాలని గురువారం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం మరియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం తో పాటు తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో ఐటిడిఎ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ 2005 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలి గత కొద్ది సంవత్సరాలుగా సుమారు 85 వేల ఎకరాల భూమిని ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు.అటవీ హక్కుల చట్టం 2005 ప్రకారం సాగు చేస్తున్న ఆదివాసులకి పట్టాలు ఇవ్వాలి,కానీ జిల్లాలో పట్టాలు ఇవ్వక సర్వే చేసి అనేక మంది రైతులకు కు మ్యాపులు కూడా ఇచ్చి ఉన్నారు. అనేక సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న భూములను ఫారెస్ట్ అధికారులు భూముల చుట్టూ, గ్రామాల చుట్టూ కందకాలు తీసి హక్కు పత్రం ఇచ్చేవరకు మాది అని మిగిలిన భూమిని దున్న కుండ అడ్డుకుంటూ ఆదివాసులను బెదిరింపులు చేస్తూ అక్రమ కేసులు పెడుతున్నారని,ప్రభుత్వం వెంటనే అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు దాడులు వెంటనే ఆపాలని అన్నారు. జిల్లాలో ఫారెస్ట్,రెవెన్యూ శాఖల మధ్య ఉన్న దాదాపు 40 వేల ఎకరాల భూమికి వెంటనే పరిష్కారం చూపుతూ సాగుచేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బంగారు రవి కుమార్,రైతు సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, ములుగు జిల్లా సిపిఎం కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గ్యానం వాసు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి గఫార్,సిపిఎం జిల్లా కార్య వర్గ సభ్యులు వెంకన్న,జిల్లా నాయకులు రాజేందర్, దావుద్,రాములు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: