CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ వేదిక గా మారిన రైతు వేదిక

Share it:

 



పేద రైతు కళ్లల్లో ఆనంద భాష్పాలు


టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొగుడుతున్న ప్రజానీకం


మన్యం మనుగడ, పినపాక: 


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన, రైతు వేదికల నిర్మాణం, పేద రైతుల జీవితాల్లో ఆనందభాష్పాలు నింపుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో గల రైతు వేదిక శనివారం నాడు కళ్యాణ వేదిక గా మారింది. రైతుల సంక్షేమార్థం, తెలంగాణ ప్రభుత్వం రైతుల కుటుంబాలకు సంబంధించిన, శుభ కార్యాలు, రైతు సదస్సులు, లాంటివి నిర్వహించుకోవచ్చునని గతంలోనే తెలియజేసింది. ఈ అవకాశాన్ని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన ఓ నిరుపేద రైతు కోడూరి వెంకన్న తన కుమార్తె వివాహార్థం, రైతు వేదికను వ్యవసాయ అధికారుల అనుమతి తీసుకొని కళ్యాణ వేదిక గా మార్చి, వివాహాన్ని చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వేదికలు, పేద రైతుల శుభకార్యాలకు కూడా ఉపయోగపడే విధంగా, రైతు వేదిక నిర్మాణం ఉండడం పట్ల గ్రామంలోని ప్రజలందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇంత మంచి గొప్ప ఆలోచనతో రైతు వేదికల నిర్మాణం చేసిన తెలంగాణ ప్రభుత్వ ముందస్తు ఆలోచనను తెలంగాణ గ్రామీణ ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నారు.

ఈ సందర్భంగా రైతు కోడూరి వెంకన్న మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ దయతో, నా కూతురి వివాహం జరిగిందని, నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక చొరవ చూపి, వేదికలు నిర్మాణాలను తొందరలోనే పూర్తి చేశారని, ఇప్పుడు నా లాంటి పేద రైతులకు రైతు వేదికలు కళ్యాణ వేదికలుగా ఉపయోగపడుతున్నాయని, ఇంత మంచి అవకాశం ఇచ్చిన పినపాక మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డికి, వ్యవసాయ అధికారులకు తన కృతజ్ఞతలు తెలియజేశాడు.

Share it:

Post A Comment: