CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆరోగ్య సూచిక తో తక్షణమే వైద్యం

Share it:

 


👉ప్రజా ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్

👉రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పైలట్ ప్రాజెక్టు లో ములుగు జిల్లాను ఎంపిక చేసినందుకు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కి ధన్యవాదాలు తెలిపారు. ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల విద్య, వైద్య - ఆరోగ్యం పై మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ నేడు ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 

మంత్రి సత్యవతి రాథోడ్ 

రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య సూచిక తయారు చేయాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసిఆర్ హెల్త్ ప్రొఫైల్ చేయడానికి ములుగు జిల్లాను ఎంపిక చేశారు. ఇందుకు సీఎం కి ధన్యవాదాలు.

భవిష్యత్ లో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పటికప్పుడు పరీక్షలు చేసి వైద్యం చేయడానికి ఆలస్యం జరగకుండా హెల్త్ కార్డ్ చూసి వెంటనే వైద్యం చేసే విధంగా బాధిత వ్యక్తి సమగ్ర సమాచారం ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డ్ లో పొందుపరుస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలి.

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలు ప్రారంభం అవుతున్నాయి. వీటితో పాటు అంగన్వాడి కేంద్రాలు ప్రారంభం అవుతున్నాయి.

 స్కూల్స్, అంగన్వాడి కేంద్రాల ప్రారంభం కోసం తీసుకునే చర్యలపై దృష్టి పెట్టాలి.

ప్రతి పాఠశాల ప్రారంభం చేయాలి. విద్యార్థులకు రెగ్యులర్ గా ఇచ్చే అన్ని వసతులు అందించాలి. వీటికి సంబంధించి ముందే జాగ్రత్తలు తీసుకోవాలి.

సమావేశంలో ఎంపి కవిత, జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ కృష్ణ ఆదిత్య అదనపు కలెక్టర్లు ఆదర్శ సురభి, రిజ్వాన్ పాషా, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: