CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భూ సమస్య పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సీపీఐ పోడుయాత్ర.

Share it:



  •  భూ సమస్య పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర స్థాయి సీపీఐ పోడుయాత్ర.
  • బ్రతకు కోల్పోతున్న పోడు రైతులు ప్రభుత్వంపై తిరగబడాలి.

మన్యం టీవీ పాల్వంచ:-

పోడు సాగుదారులు, రైతుల భూ సమస్య పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా సిపిఐ, టిజిఎస్, బికెఎంయు ఆధ్వర్యంలో ఐదు రోజుల పోడుయాత్ర ఈ నెల జోడేఘాట్లో 4న ప్రారంభం అయిన రాష్ట్ర నేతల యాత్ర 7న పాల్వంచకు చేరుకోనున్నదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం తెలిపారు. సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ముఖ్యకార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిస్టులు పేదలకోసం సాధించిపెట్టిన 2006 అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారన్నారుని. చట్టం ప్రకారం 2005 పూర్వం సాగులో ఉన్న పోడు భూములకు హక్కు పత్రాలు జారీ చేయాల్సిన ప్రభుత్వం చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని, హరితహారం పేరుతో సాగులో ఉన్న భూములను లాక్కుంటూ పేదలకు బత్రకు లేకుండా చేస్తున్నారన్నారు. జీవనం కోల్పోతున్న పేద రైతులు ప్రభుత్వంపై తిరగబడి భూములను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. పూర్తిగా ఎజెన్సీతో ముడిపడి ఉన్న భద్రాద్రి జిల్లాలో పోడు రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. అనేక ప్రాంతాల్లో పోడుభూములను ప్రభుత్వం ఆక్రమించుకుంటోందని, పేదలకు అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. పార్టీలకతీతంగా పోడు రైతుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పోడు సమస్య పరిష్కారమే ఏకైక ఎజెండాగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో జరిగే పోడుయాత్ర పాలకులకు కనువిప్పుకలిగేలా నిర్వహించాలన్నారు. 2006 అటవీ హక్కుల చట్టం అమలు, పొడుసాగుదరులకు రైతు బంధు, భీమా సౌకర్యం, బ్యాంకు వ్యవసాయ రుణాలు సాధించుకునేవరకు ప్రభుత్వంపై వత్తిడి తేవాలని పిలుపునిచ్చారు. భూ సమస్య ప్రధాన డిమాండ్ తో జరుగుతున్న యాత్రలో పోడు రైతులు, భూ నిర్వాసితులు అధిక సమఖ్యలో పాల్గొనేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. 8వ తేదీన కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలోని లక్ష్మి దేవిపల్లి మండలం పడిగాయిగూడెంలో పొడు సాగుదారుల బహిరంగసభ జరగనుందిని. యాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాగం హేమంతరావు, ఎస్. బాలమల్లేష్, జిల్లా కార్యదర్శి యస్.కె సాబీర్ పాషా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, రావుపల్లి రాంప్రసాద్ తోపాటు రాష్ట్ర, జిల్లా టిజిఎస్, బికెఎంయు నాయకత్వం పాల్గొంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబా,మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా సమితి సభ్యులు బండి నాగేశ్వరరావు, బాగం రాంప్రసాద్, ఉప్పుశెట్టి రాహుల్, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, ఏఐటీయూసీ, ప్రజాసంఘాలు నాయకులు అన్నరపు వెంకటేశ్వర్లు, ఉపేంద్రా చారి, జ్యోతుల రమేష్, సత్యనారాయణ, రాము, చేరాలు, నాగమల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: