CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మెగా గ్రీన్ పార్కు పేరుతో దళిత భూములపై కన్ను..

Share it:

 



👉దళితుల సాగు భూముల్లో శంకుస్థాపనలు..


👉రెవిన్యూ అధికారుల నిర్ణయం మార్చుకోవాలని దళితులు ధర్నా..


మన్యం టీవీ : జూలూరుపాడు, జులై 28, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు పంచాయతీ పరిధిలోని ఎస్సి కాలనీకి చెందిన  నిరుపేద దళితుల సాగుభూముల్లో మెగా గ్రీన్ పార్కు పేరుతో భూములను లాక్కొవాలని చూస్తున్న రెవెన్యూ  అధికారుల నిర్ణయాన్ని మార్చుకోవాలని బుధవారం ఎస్సీ కాలనీ గ్రామస్తులు, మహిళలు, తెరాస నాయకులు, దళితసంగ నాయకులతో  కలిసి  జూలూరుపాడు తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహశీల్దార్ లూథర్ విల్సన్ కి మెమోరాండం అందజేశారు.  ఈ సందర్బంగా నాయకులు   మాట్లాడుతూ.. గత పాలక ప్రభుత్వాలు నిరుపేద దళితులకు భూమి ఇస్తే, ప్రాణాలు తెగించి  పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో  దళితుల భూములకు రక్షణ లేకుండా పాయిందని అన్నారు. ఒకపక్క "దళిత బంధు" అని ప్రకటనలు చేస్తూ.. మరో పక్క దళితుల భూములను లాక్కోవడం హెయమైనా చర్య అన్నారు. జూలూరుపాడు రెవిన్యూ పరిధిలో దళితులు

 సాగు చేసుకుంటున్న భూములను లాక్కొని వారి కుటుంబాలను నడిరోడ్డుమీద నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న రెవిన్యూ అధికారుల నిర్ణయం మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం మూడెకరాల భూమి ఇస్తానని దళితులకు హామీ ఇచ్చి, ఇప్పుడు దళితుల  సాగుభూమిని లాక్కోవాలనే ఆలోచనను  మానుకోవాలని అన్నారు.  లేని పక్షంలో దళితులంతా ఎకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్బంగా సిపిఎం పార్టీ కార్యవర్గ సభ్యులు కాసాని ఐలయ్య మాట్లాడుతూ.. జూలూరుపాడు మండల పరిధిలో  ప్రభుత్వ భూములు, గుట్టలు, అటవీ ప్రాంతం, గిరిజనేతరులు దొడ్డిదారిన అనుభవిస్తున్న ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయని అన్నారు. అవసరమైతే ఆ భూములను లాక్కొని డెవలప్మెంట్ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలని హితవు పలికారు. అంతేకానీ దళితులు సాగు చేసుకుంటున్న భూములు జోలికి రావద్దని హెచ్చరించారు. దళితులకు సిపిఎం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చాపలమడుగు రామూర్తి, వేల్పుల నరసింహారావు, రామకృష్ణ, సురేష్, బిక్షం, జయమ్మ, పాముల పద్మ, సిహెచ్ నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: