CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సిపిఎం పార్టీ లో చేరికలు.

Share it:

 


👉పోడు భూములు జోలికొస్తే ఉద్యమాలు ఉదృతం చేస్తాం.

👉గిరిజనులది భూ సమస్య కాదు వారి బ్రతికే సమస్య.

👉మేనిఫెస్టోలో హామీలు ఇవ్వడం కాదు వాటిని నెరవేర్చండి. కాసాని ఐలయ్య..



మన్యం టీవీ : జూలూరుపాడు, జులై 19, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల పరిధిలోని బొజ్యా తండా గ్రామానికి చెందిన 26 కుటుంబాలు సోమవారం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆధ్వర్యంలో చేరాయి.అనంతరం గ్రామంలో గ్రామస్తులు పార్టీ దిమ్మెను నిర్మించారు. కాసాని ఐలయ్య పార్టీ జెండాని ఆవిష్కరించారు. బానోత్ ధర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో భాగంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య, రాష్ట్ర కార్యదర్శి అన్నవరపు కనకయ్య, మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో, దేశ ప్రజలకు ప్రత్యన్మయము మార్కిస్టు పార్టీ అని అన్నారు.బొజ్యా తండా ప్రజలు వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈరోజు 26 కుటుంబాలు పార్టీలో చేరాయని అన్నారు. రాష్ట్రంలో దేశంలో జీవించటానికి ప్రశ్నించే హక్క లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో తెరాస రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో వాగ్దానలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. ప్రతి పేదవాడికి మూడు ఎకరాల భూమి ఇస్తానన్న మాట నీటి పై రాత గా ఉందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా బలవంతంగా తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు తక్షణమే రద్దు చేయాలని అన్నారు.ఆరు నెలల పాటు అవుతున్న కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. పోడు భూములు జోలికి వస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములు జోలికి రావద్దని హెచ్చరించారు. పార్టీలో చేరిన కుటుంబాలు బానోత్ వెంకట్, రాజు, మాలోత్ సురేష్, లావుడియా విజయ, ఆంబోతు సక్రం, బానోత్ భద్ర, తేజ, రాము, యం మహేష్, గూగుల్ ఎర్త్ శ్రీహరి, మాలోత్ నవీన్, మాలోత్ స్వామి, మాలోత్ దష్ప, ధర్మం సోత్ స్వామి, మాలోత్ జయరామ్, రాంబాబు, లావుడియా బాబూలాల్, బానోతు రవి ఎంమధు మాలవత్ శంకర్, వీరితో పాటు 

 26 కుటుంబాలు, పార్టీలో చేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాటోత్ కృష్ణ, మండల కార్యదర్శి చీమలపాటి బిక్షం, మండల నాయకులు గార్లపాటి వెంకటి, భానోత్ ఇశ్రా, ఊడల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: