CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి

Share it:

 


*జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఐపీఎస్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా పోలీస్ కార్యాలయం నందు శనివారం నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ఐపీఎస్ ఈ సందర్భంగా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ పెండింగ్ కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించారు. నమోదైన కేసులలో నేరస్తులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన కేసులను గుర్తించి దర్యాప్తు అధికారులకు రివార్డు అందజేయాలని అదేవిధంగా అన్ని ప్రార్థనా మందిరాల పరిసరాలలో తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ క్రైమ్స్ కు పాల్పడే నేరస్తుల చేతుల్లో నష్టపోకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. నూతన టెక్నాలజీని ఉపయోగిస్తూ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించాలని సూచించారు. ప్రజలు రానున్న బక్రీద్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అనుమతి లేకుండా పశువులను రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో నేర ప్రవృత్తి కలిగి ఉండే వారిపై నిఘా ఉంచి ఆస్తి సంబంధిత నేరాలు జరగకుండా చూడాలన్నారు. వర్షాలు అధికంగా పడుతున్నందున వరద ముంపుకు గురయ్యే ప్రదేశాలను గుర్తించి ఆ గ్రామాల ప్రజలను తరలించడానికి మరియు వారికి ఆశ్రయం కల్పించడానికి సంసిద్ధంగా ఉండాలని అన్నారు. డయల్ 100 ఫిర్యాదుల పట్ల తక్షణమే స్పందించి బాధితులకు సహాయపడాలన్నారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశాల వద్ద సూచికలను ఏర్పాటు చేయాలన్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది అందరూ నూతనంగా వస్తున్న టెక్నాలజీ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.ఈ సమీక్ష సమావేశం నందు ములుగు ఏఎస్పి పోతరాజు సాయి చైతన్య ఐపీఎస్, ఏటూరునాగారం ఏఎస్పి గౌష్ ఆలం ఐపీఎస్, ఏఎస్పీ చెన్నూరి రూపేష్ ఐపీఎస్,ఎస్బి ఇన్స్పెక్టర్ రెహమాన్,పసర సీఐ అనుముల శ్రీనివాస్,ములుగు సీఐ గుంటి శ్రీధర్, ఏటూరునాగారం సీఐ సట్ల కిరణ్ కుమార్, వెంకటాపురం సీఐ శివ ప్రసాద్,డిసిఆర్బి ఎస్ఐ చైతన్య చందర్ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: