CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Share it:

 


💥తహశీల్దార్ కే. విక్రమ్ కుమార్

మన్యం మనుగడ, పినపాక:

గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ కే.విక్రమ్ కుమార్ సూచించారు.గోదావరి పరివాహక ప్రాంత మరియు ఇతర గ్రామాల ప్రజలు గోదావరి నది, చెరువులు, కుంటలు మరియు వాగులు పొంగే అవకాశం ఉన్నందున ఎవరూ చేపలవేటకు వెళ్లరాదు. చెరువులు, కుంటలు, వాగులు పొంగి రోడ్డుపైకి నీరు ప్రవహించినప్పుడు మరియు కల్వర్టు పై నీరు ప్రవహించి నపుడు రోడ్డు దాటే ప్రయత్నం చేయకూడదు. కూలడానికి సిద్ధంగా ఉన్న పాతఇళ్లలో ఎవరు ఉండకుండా చూసుకోవాలి. అలాంటివారు ఎవరైనా ఉన్న రెవెన్యూ లేదా పంచాయతీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన రక్షిత ప్రదేశానికి తరలించబడును. నిరంతరం వర్షాలు కురుస్తునందున విద్యుత్ షాక్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వరద నీరు వలన ప్రమాదకర విష పురుగులు పాములు తిరిగే ప్రదేశాల్లో ప్రజలు తిరగ కూడదు. మండల ప్రజలుపై జాగ్రత్తలు పాటిస్తూ వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలి అని ఆయన ఒక ప్రకటన లోకోరారు .

Share it:

TECHNOLOGY

TELANGANA

Post A Comment: