CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దళిత ప్రజా ప్రతినిధి పై రాజకీయ వివక్ష తగదు

Share it:

 


తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంపల శివ కుమార్.

మన్యం టీవీ ఏటూరు నాగారం దళితుల ఆత్మ గౌరవం నిలబెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని ఓవైపు చెబుతూ. మరోవైపు దళిత ప్రజా ప్రతినిధులను అవమనలకు గురి చేస్తోందిని తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు గంపల శివ కుమార్ అన్నారు. విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా దళిత మహిళా జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిని పైజరుగుతున్న రాజకీయ వివక్ష ఇందుకు నిదర్శనం జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్శిని రాజకీయ ఉనికి లేకుండా చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రోద్బలంతో పార్టీలో జడ్పీ పాలక వర్గంలో ఆమె పై వివక్ష కొనసాగుతుందన్నారు.

చాలా కాలంగా జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూపాలల్లిలో నియోజక వర్గం పూర్తి స్థాయిలో అన్ని మండలాలకు జడ్పీ చైర్మన్ గా వ్యవహరించడం లేదని కేవలం నాలుగు మండలాల కు మాత్రమే చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.ఇది వాస్తవం కాదా అని అన్నారు. తన అనుమతి లేకుండా భూపాలపల్లి లోని ఇతర మండలాలకు రావద్దని ఆదేశాలు జారీ చేయడం వెనుక ఆంతర్యమేమిటి ఇదేనా తెలంగాణ ప్రభుత్వానికి దళితుల మీద ఉన్న ప్రేమ అని ఆయన ప్రశ్నించారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి సోమవారం ప్రారంభించడానికి ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సివిల్ సప్లై శాఖల మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ స్వర్ణలత పేరుతో మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ కు ఆహ్వానం వెళ్ళింది.అయితే జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గా ఉన్న జక్కు శ్రీహర్షిని పేరును ఇన్విటేషన్ లో పేర్కొనక పోవడం చూస్తే దళిత ప్రజాప్రతినిధులను అవమానించడమేనని అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు.జడ్పీ చైర్పర్సన్ పై రాజకీయ వివక్ష ప్రోటోకాల్ పాటించకపోవడం చూస్తే దళితులపై ఏ విధంగా ప్రేమ ఉందో అర్థంచేసుకోవచ్చన్నారు. జక్కు శ్రీ హర్షిని దళిత ప్రజా ప్రతినిది కావడంతోనే ఉన్నత అధికారులు ప్రజా ప్రతినిధులు ఆమెపై రాజకీయంగా వివక్షత చూపుతున్నారని అన్నారు. భూపాలపల్ల ప్రజానీకం జక్క శ్రీహర్షిని పై రాజకీయ వివక్ష కొనసాగుతోందని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని దళిత ప్రజలపై దళిత ప్రజాప్రతినిధులపై వివక్షత చూపే ఊరుకునేది లేదని తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Share it:

Post A Comment: