CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాద్రి జిల్లా ప్రాముఖ్యతకు నిదర్శనం-ఈ ఫ్లెక్సీలు

Share it:

 


( పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు)

మన్యం మీడియా,అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి నామకరణంతో నూతనంగా ఏర్పాటైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క ప్రాధాన్యతను చాటే విధంగా. భద్రాచలం పట్టణంలోని శ్రీరాముని దివ్యక్షేత్ర చిత్రాలతో రూపొందించిన ఫ్లెక్సీలను, జిల్లా సరిహద్దు మండలమైన అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సరిహద్దు ప్రాంతమైన జాతీయ రహదారికి ఇరువైపులా, స్థానిక సర్పంచ్ అగ్గి కవిత మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి విజయ్ ఆధ్వర్యంలో, కొంతమంది ప్రజాప్రతినిధుల సహకారంతో, పల్లె ప్రగతి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఉన్నతాధికారుల సలహా మేరకు గ్రామ పంచాయతీ నిధులతో ఫ్లెక్సీలను నిర్మించారు. పుణ్యక్షేత్రం దర్శనానికి విచ్చేస్తున్న భక్తులు, ప్రయాణికులు. కొద్దిసేపు ఆగి, ఫ్లెక్సీలను తిలకిస్తున్నారు. ప్రకృతి వనరులు మధ్య భద్రాద్రి జిల్లా ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రయాణికులకు స్వాగతం-సుస్వాగతం మరియు ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్లెక్సీలను నెలకొల్పేనందుకు, కొంతమంది ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

Share it:

POLITICS

Post A Comment: