CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పల్లెల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం

Share it:

 


👉అబ్బుగూడెం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా (ఐఏఎస్)

👉(పల్లె ప్రగతి గ్రామ సభకు హాజరైన జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు)

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:; తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా (ఐఏఎస్). భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం. అబ్బుగూడెం గ్రామంలో నిర్వహించిన నాలుగో విడత పల్లె ప్రగతి  గ్రామ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. వారిని మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు. పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతించారు. వారితో పాటు ఈ గ్రామ సభకు జిల్లా కలెక్టర్-అనుదీప్ దురిశెట్టి (ఐఏఎస్) మరియు భద్రాచలం ఐటీడీఏ పీవో-గౌతమ్ పోట్రు (ఐఏఎస్),డిఆర్డిఓ-మధుసూదన్ రాజు, డిపిఓ-లక్ష్మీ రమాకాంత్, తదితర జిల్లా అధికారులు, అశ్వారావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే-మెచ్చా నాగేశ్వరరావు, అన్నపురెడ్డిపల్లి మండల ఎంపీపీ-సున్నం లలిత, జెడ్పిటిసి-భారత లాలమ్మ మరియు మండల అధికారులు, పాల్గొన్నారు. అబ్బుగూడెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్-కర్రి వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన పల్లె ప్రగతి గ్రామ సభలో,ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా (ఐఏఎస్) మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధికి నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని తీసుకువచ్చి, గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిందని, మండలంలో అందరూ మహిళ అధికారులు ఉండటం.ఒక ప్రత్యేకత అని, మండల అభివృద్ధిలో బాగా పని చేస్తున్నారు కాబట్టే అవార్డులు వస్తున్నాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగించి మండలాన్ని మరింత అభివృద్ధి చేయాలని, గ్రామాల అభివృద్ధికి నూతనంగా ఆలోచనలు చేయాలని సూచిస్తూ అభినందించారు. పల్లెలు పచ్చదనంతో శుభ్రంగా ఉండాలని, ప్రజల ఆసరాలు ప్రకారం గ్రామాలు అభివృద్ధి చెందేందుకు సౌకర్యాలు కల్పించాలనే, లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టినట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమాలు పది రోజుల పాటు కాకుండా, నిరంతరాయంగా జరగాలని. మన ఇల్లు వలే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచ్, పంచాయతీ కార్యదర్శిలదే అని, గ్రామాలే వారికి ఇల్లు అని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుండి సేకరించిన వ్యర్థాలతో వర్మి కంపోస్ట్ ఎరువులు తయారు చేయాలని, అవకాశం ఉన్న ప్రతి రహదారికి ఇరువైపుల రెండు వరుసల్లో మొక్కలు నాటడంతో పాటు మధ్య మధ్యలో మల్టీ పర్పస్ మొక్కలు నాటాలని, డంపింగ్ యార్డులు వైకుంఠధామాల్లో బయో ఫెన్సింగ్ కు సంబంధించిన మొక్కలు నాటించాలని తెలియజేసి,ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామపంచాయతీ హరితహారం నర్సరీ, అవెన్యూ ప్లాంటేషన్స్, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ షెడ్, వైకుంఠ థామాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: