CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఘనంగా రాహుల్ గాంధీ పుట్టిన రోజు వేడుకలు

Share it:

 


ఏటూరు నాగారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా డాక్టర్లను, ఏఎన్ఎం లను, ఆశా వర్కర్ లను సన్మానించిన ములుగు ఎమ్మెల్యే సీతక్క.

మన్యం టీవీ ఏటూరు నాగారం

అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లను, ఏఎన్ఎం లను, ఆశ వర్కర్ల శాలువాలతో సన్మానించి చీరలను అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో నిరంతరం తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలు సకాలంలో చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ష వడ్ల వెంకన్న, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండి అయూబ్ ఖాన్, ఏటూరు నాగారం మండల అధ్యక్షులు చిటమట రఘు, కన్నాయిగూడెం మండల జెడ్పిటిసి నామ కరం చంద్ గాంధీ, ఎంపీటీసీ గుడ్ల శ్రీలత దేవేందర్, స్థానిక సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కన్నాయిగూడెం మండల వైస్ ఎంపీపీ బోల్లే భాస్కర్, సహకార సంఘం వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి  చిన్న ఎల్లయ్య, ముక్కెర లాలయ్య, ఎండి సులేమాన్, బాబా, సీతక్క యువసేన మండల అధ్యక్షులు ఎండి గౌస్ పడిదల హనుమంతు, చిక్కుల మానస, ఎండి రియాజ్ జియా, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దల నవీన్, మామిడి రాము, బత్తుల సంపత్, తాళ్లపల్లి నరసింహులు, గడ్డం మహేష్, మహిళా మండలి అధ్యక్షురాలు కట్కూరి రాధిక, తిరుపతమ్మ, జనార్ధన్, జిలాని, కిరణ్, గడ్డం శ్రీధర్, వావిలాల సాంబశివరావు, నేకరకంటి  ముతేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: