CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇదేనా తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అంటే తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తుంది

Share it:

 


               రాజమల్ల సుకుమార్  తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు

మన్యం టీవీ మంగపేట.          ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం కోమట్ల గూడం కి చెందిన మరియమ్మ ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ ను భువనగిరి జిల్లా అడ్డగూడూరు కు చెందిన పోలీస్ లు ఈ నెల 16 న వారిని అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లు గొడ్డును బాదినట్టు బాది అత్యంత బాధాకరం ఈ నెల 17న మళ్లీ మరియమ్మను చింతకాని మండలం కోమట్ల గూడం తీసుకువచ్చి గ్రామస్తులు అందరూ చూస్తుండగా చింతకాని పోలీస్స్టేషన్లో వదిలేస్తామని  చెప్పి చింతకాని కాకుండా కొనిజర్ల తీసుకువెళ్లి కుమార్తె ముందే మరియమ్మ అనే మహిళను శారీరకంగా హింసించడం బాధాకరం అక్కడి నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో చింతకాని స్టేషన్కు తీసుకువచ్చి చంటి బిడ్డ తో ఉన్న కుమార్తె ముందే రాత్రంతా పైన గదిలో నలుగురు కానిస్టేబుళ్లు (మహిళా కానిస్టేబుళ్లు లేకుండా) ఒకరి తర్వాత ఒకరు ఒళ్ళు హూనం అయ్యేట్టు చిత్రహింసల తో లాఠీలతో కొట్టారు దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాధుడే లేడు కనీసం కూతురు ప్రాధేయపడినా మా అమ్మను కొట్టకండి మా అమ్మను చంపకండి అని కుమార్తె ఎంత చెప్పినా పోలీసులు కనికరించలేదు చివరకు ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకాని నుంచి అడ్డగూడూరు స్టేషన్ కు తరలించ అక్కడ  కూడా విపరీతంగా కొడితే దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతిలో పోలీస్ స్టేషన్లో ప్రాణాలు విడిచింది ఈ దారుణమైన ఘటనపై రాష్ట్ర గవర్నర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి పూర్తి సమాచారం తెప్పించుకొని విచారణ చేయాలి కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాగే ఈ సంఘటన మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత తక్షణమే నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని దళిత మహిళ మరియమ్మ మరియు కుటుంబ సభ్యులు చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్లో మూడు రోజులపాటు నిర్బంధించి లాఠీలతో బెల్టుతో దారుణంగా కొట్టి అడ్డగూడూరు ఎస్ ఐ కానిస్టేబుల్ మరియు సిబ్బంది ని పోలీస్ శాఖ నుండి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం వారిపై చట్టపరంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఈ ఘటనలో మరణించిన మరియమ్మ కుటుంబానికి కోటి రూపాయల ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆమె కుమారుడు ఉదయ్ కిరణ్ శంకర్ లకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని తెలంగాణ మాలమహానాడు తరుపున డిమాండ్ చేస్తున్నాం టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంప పడుతున్నారు గతంలో  శీలం రంగయ్య మరియు వేములవాడలో ఇలాగే జరిగింది ఇప్పుడు మరియమ్మ ఘటన అయినా ఇంతవరకు ఎక్కడా న్యాయం జరగలేదు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళితుల పట్ల మానవత్వం మానవత్వం దృక్పథంతో వ్యవహరించాలని అనేక ఏళ్లుగా మానవ హక్కుల దూరమైన దళితుల పట్ల పోలీసులు మానవత్వం దృక్పథంతో రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం మరియమ్మ వారి కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం

Share it:

TELANGANA

Post A Comment: