మన్యం టీవీ, అశ్వాపురం:నకిలీ విత్తనాలు ప్రభుత్వ అనుమతి లేని విత్తనాలు అమ్మితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అశ్వాపురం సి ఐ సట్ల రాజు, ఏవో సాయి శంతన్ కుమార్ అన్నారు. మండల పరిధిలోని మొండికుంట లో ఎరువులు పురుగు మందుల దుకాణాలను సిఐ, ఏవో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. దుకాణాలలో పత్తి విత్తనాలు ప్యాకెట్లను, స్టాక్ పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు. రైతులు విత్తనాలు పురుగు మందులు కొనుగోలు చేస్తే తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు, నాసిరకంగా పురుగుమందులు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీస్, వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలన్నారు.
Post A Comment: