CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి...

Share it:

 


ఆదర్శ వ్యక్తి సుందరయ్య..

రాష్ట్రంలో నిజాం పరిపాలన సాగితే సుందరయ్య గారిని ఆదర్శంగా తీసుకుని ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

గార్లపాటి పవన్ కుమార్...



 

మన్యం టీవీ : జూలూరుపాడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,  జూలూరుపాడు లో పుచ్చలపల్లి సుందరయ్య  36 వ వర్ధంతి కార్యక్రమాన్ని  ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు గార్లపాటి పవన్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందుండి నడిపిన వ్యక్తి అని అన్నారు. అతన్ని కమ్యూనిస్టు గాంధీగా పిలుస్తారని స్వాతంత్ర ఉద్యమంలో అతి చిన్న వయసులోనే చురుగ్గా పాల్గొని బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి అని అన్నారు. ఐదవ తరగతి ఆయన అనంతరం నిజామాబాదు లో చదివినప్పుడు కమ్యూనిస్టులా  పరిచయం ఏర్పడింది అన్నారు. పార్లమెంట్ కి సైకిల్ మీద వెళ్ళిన వ్యక్తి సుందరయ్య అని అన్నారు. కుల సూచికను పోగొట్టే విధంగా తమ పేరుని సుందర్ రామిరెడ్డి (రెడ్డి) అనే కులం సూచికను తొలగించి సుందరయ్య అని పేరు పెట్టుకున్నారని అన్నారు. మార్క్సిస్టు పార్టీ ఏర్పడినప్పుడు అతను ఒక సాధారణ కార్యదర్శిగా ఎన్నికయ్యాడనని, పొలిట్బ్యూరో సభ్యునిగా కూడా ఎన్నికయ్యారని, అతని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజుల్లో జరుగుతున్న రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసే విధంగా ప్రతి ఒక్కరు ముందుండి పాల్గొనాలని అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు ఎం శివ, డి పవన్, నాగేష్, రామ్ చరణ్,  కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: