CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మండల కేంద్రంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు అలెం.కోఠి ఆర్థిక సాయం

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండల లో కరోనాతో చనిపోయిన కారం.నాగేశ్వరావు(ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా నాయకులకు) కుటుంబానికి రూ.5000 రూపాయలు మరియు 75 బియ్యం ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా తో చనిపోయిన వారికి 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.అలాగే ఏజెన్సీ ప్రాంతంలో కరోనా టెస్టులు పెంచాలని,కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో చేర్చాలని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు తెలంగాణ ప్రభుత్వ హయాంలో రక్షణ లేకుండా కరువైందని ఘాటుగా విమర్శించారు. ఆదివాసులకు అనారోగ్యం తో ఆపద వస్తే,హెలికాప్టర్లో తీసుకుపోయి వైద్యం అందిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ మాట నీటి మూటలాగా అయిందని విమర్శించారు.ఏజెన్సీ ప్రాంత వనరుల మీద  ఉన్న ప్రేమ,ప్రజల ప్రాణాల మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా అని  విమర్శించారు. ఆదివాసి ఉద్యోగస్తులు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, అన్ని సామాజిక వర్గాలు కూడా కరోనా తో మృతి చెందిన కారం నాగేశ్వరావు తో పాటు,మిగతా కరోనా తో పోరాడుతున్న కుటుంబాల ను కూడా ఆదుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఊకే.నగేష్, నరసింహారావు,కారం.రవి,సుజాత తదితరులు పాల్గొన్నారు.

Share it:

SLIDER

Post A Comment: