CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు.

Share it:

 


ఎస్ఐ ప్రవీణ్ కుమార్, ఎంపిడిఓ శ్రీను

మన్యం టీవీ కరకగూడెం:కరోనా నిబంధనలు పాటించక పోతే చట్టపరమైన చర్యలు తప్పవని కరలగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్, ఎంపీడిఓ శ్రీను అన్నారు.మండలంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయుటకు తీసుకోవలసిన చర్యలపై మండల పరిషత్ కార్యాలయంలో మండల కరోనా నివారణ కమిటీ సమావేశం నిర్వహించటం జరిగింది. సమావేశం లో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా ఎస్ఐ  ప్రవీణ్ కుమార్  మాట్లాడుతూ

కేసులు పెరగటానికి జనం సమూహంగా ఏర్పడటమే కారణమని  వాటిల్లో వివాహాలు ప్రాధానపాత్ర పోషిస్తున్నాయని కావు‌న వివాహలను ప్రభుత్వ నిబందనల మేరకు అనుమతించబడిన సంఖ్యతో మాత్రమే జరపాలని లేనియడల చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేసారు.

 కోవిడ్ లక్షణాలు ఎవరికైనా వున్నట్టు అనుమానం వస్తే ఆ గ్రామపంచాయతీ సర్పంచ్ లేదా కార్యదర్శి కి ఫోన్ చేసి చెప్పాలని వారి ఇంటి వద్దకే ఆశా వర్కర్లు,ఎఎన్ఎమ్ లు వచ్చి మెడికల్ కిట్ ఇస్తారని ఈ అవకాశం వినియేగించుకొని ఇంటిలోనే ఐసోలేషన్ లో వుండాలని ఎంపిడిఓ శ్రీను కోరారు. 

అదే విధంగా వ్యాపారస్తులు  కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో స్వచ్చందంగా వ్యాపార సమయాన్ని కుదించడం కొంత సంతోషకరమని తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి వుండాలని ,ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా వున్నందున ఒక మాస్క్ వలన పూర్తి రక్షణ వుండకపోవచ్చు అని డబుల్ మాస్క్ ధరించడం శ్రేయస్కరమని , ప్రజలందరు అత్యవసరమైతేనే బయటకు రావాలని లేనియడల ఇంటి వద్దే వుండాలని విందులు, వినోదాలకు హజరుకాకపోవడం మంచిదని ఎంపీఓ సునీల్ కుమార్ తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో తహసీల్దారు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ నర్సింహరావు,కరకగూడెం కార్యదర్శి వెంకటేష్, ఐకెపి.సి.సి.మురళీ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: