CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పిట్టతోగు వలస ఆదివాసి ఆవేదన

Share it:

 


మూర్చ వ్యాధి కారణంగా నిప్పులో పడ్డ బాలుడు

సగం శరీరం కాలిపోయి బాధలు పడుతున్న ఆదివాసి బిడ్డ

మన్యం మనుగడ క్షేత్ర పరిశీలనలో గోడువెళ్లబోసుకున్న ఆదివాసీ తల్లిదండ్రులు


మన్యం మనుగడ, పినపాక:.    అది ఒక వలస ఆదివాసీ గ్రామం.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని జానంపేట పంచాయితీకి చెంది,  దూరంగా విసిరి వేయబడి నట్లు, పూర్తిగా సమాజానికి సంబంధం లేకుండా,  జానంపేట గ్రామం నుండి అడవి మార్గంలో పది కిలోమీటర్లు, వాగులు వంకలు దాటి ప్రయాణిస్తే వచ్చే వలస ఆదివాసీ గ్రామం  పిట్టతోగు. ఆ గ్రామంలో లెక్కకు 22 గడపలు. ఆ గ్రామంలోని తాటి సన్ను- జ్యోతి ల కుమారుడు తాటి పాండు. తాటి పాండు కు  చిన్నప్పటినుండి మూర్ఛ వ్యాధి ఉంది. 4 సంవత్సరాల క్రితం ఇంటిలో ఎవరూ లేని సమయంలో, మూర్చ వ్యాధి రావడంతో నిప్పుల పోయి వెలుగుతూ ఉండడంతో,  పాండు పోయి లోనే పడిపోవడం జరిగింది. ఎవరు గమనించకపోవడం వల్ల పాండు యొక్క వీపు భాగం, ఎడమ చేయి చాలావరకు కాలిపోవడం జరిగింది. గమనించిన పిట్టతోగు గ్రామ జనం అతనిని కాపాడడం జరిగింది. తల్లిదండ్రులు అతడిని దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా, వరంగల్ ఆస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇవ్వడం జరిగింది.వారి సలహా మేరకు తమ కుమారుడు ని తీసుకుని వరంగల్ ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేపించినప్పటికి నాలుగు సంవత్సరాల నుండి వీపుకు కు అయిన గాయం ఏ మాత్రం తగ్గడం లేదని ఎడమ చేయి కాలిపోయిన కారణంగా శరీరానికి అతుక్కు పోవడం వలన , తమ కుమారుడు చాలా ఇబ్బంది పడుతున్నాడని, పినపాక మండల ఆదివాసి ఐక్య వేదిక అధ్యక్షుడు, ఆదివాసీ గ్రామాల సామాజిక కార్యకర్త తోలెం శ్రీను సహాయంతో, క్షేత్ర పరిశీలనకు వెళ్లిన మన్యం మనుగడకు ఈ విషయం తెలిసింది. రెక్కాడితే గాని డొక్కాడని తమ జీవితాలకు దయ గల దాతలు ఎవరైనా ఉంటే, వారి కుమారుడికి ఆపరేషన్ చేయించాలని పాండు తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: