CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మనసున్న మారాజులు

Share it:

 


ఎమ్మెల్యే రేగా స్పూర్తితో అంగన్వాడి నిర్మాణానికి సాయం.


మన్యం టీవి పినపాక: మారుమూల  గ్రామం. సరైన రోడ్డు మార్గం కూడా లేదు.  అదే పినపాక మండలం లోని తోగ్గూడెం పంచాయతీలో గల  వలస ఆదివాసి గ్రామం టేకులగూడెం. ఆ గ్రామంలోని ఆదివాసీలకు కరోనా కాలంలో సేవలు అందించి కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ అంగన్వాడీ కార్యకర్త పురస్కారాన్ని పొందింది మినీ అంగన్వాడీ కార్యకర్త కలం చంద్రకళ. అయితే టేకులగూడెం లో  వర్షాకాలంలో వచ్చిన వానలకు, కట్టెలతో  నిర్మించిన అంగన్వాడీ కార్యాలయం కూలిపోయింది. ప్రస్తుతం అక్కడ గల కర్రలతో నిర్మించిన బాల వెలుగు పాఠశాలలోనే అంగన్వాడి సేవలు నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంచే పురస్కారం పొందిన చంద్రకళ ను సత్కరిద్దామని వెళ్లిన టిఆర్ఎస్ పార్టీ మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ అంగన్వాడి కొరకు ఎలాంటి ఆశ్రయం లేదని తెలుసుకున్నారు.

అంగన్వాడి కొరకు తమ వంతుగా ఏదైనా సాయం చేస్తాం అని హామీ ఇచ్చారు . ఇటీవలనే టేకులగూడెం గ్రామపెద్ద నూప భద్రయ్య, అతని సహచర బంధుగణం అందరూ కలిసి కట్టెల సహాయంతో అంగన్వాడి నిర్మాణం చేపట్టారు . అంగన్వాడీ పైకప్పు గా వాడే పెంకులను గురించి పినపాక ఎంపీటీసీ చింతపండు సత్యం ను టేకులగూడెం గ్రామపెద్ద నూప భద్రయ్య కలిసి తెలియజేశాడు. విషయం తెలుసుకున్న చింతపండు సత్యం ఏడూళ్ల బయ్యారం గ్రామవాసి, టిఆర్ఎస్ పార్టీ రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డికి తెలియజేశాడు. వెంటనే స్పందించిన దొడ్డ శ్రీనివాస్ రెడ్డి పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్ఫూర్తితో అంగన్వాడి నిర్మాణం కొరకు కావలసిన పెంకులను తనవంతు సహాయంగా టేకులగూడెం పంపించారు. పెంకులు సహాయంతో అంగన్వాడి నిర్మాణం పూర్తి చేసిన టేకులగూడెం వాసులు, అడిగిన వెంటనే స్పందించిన ఎంపీటీసీ చింతపండు సత్యం, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి లను మనసున్న మారాజులు అని కొనియాడి, వారి కృతజ్ఞతలను తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: