CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జంగో లింగో దీక్షతోనే జీవితాలు బాగుపడను

Share it:

 



ఉట్నూర్ మన్యం టివి ప్రతినిధి.


ఇచ్చోడ మండలం గెర్జేమ్ గ్రామంలో జంగో లింగో దీక్ష దారులు పెంధోర అర్జున్ మాట్లాడుతూ సూర్యచంద్రులు అకి పెన్, పెర్సపెన్, జెండా ముండలో ఉంటాయి. నేడు ఈ వేషధారణ ఎందుకు చేయాలి అంటే సూర్యుని రంగు అలాగే సూర్యుడు అంటే లింగో చంద్రుడు అంటే జంగుబాయి అని తెలిపారు. ఈ సంస్కృతి అనేక మతాలకు ముందు నుంచి ఉంది. గోండి ధర్మం. అన్ని ధర్మలకి ముందు నుంచి ఉంది. పాహాండి కూపర్ లింగో గోండులకు మాత్రమే గురు కాదు ప్రపంచానికే గురు అని తెలిపారు. నేడు ఎంతో మంది విద్యావంతులు ఉన్నారు కానీ వారు ఇతర మతాల దీక్షలు  స్వీకరిస్తున్నారు కానీ తమ సొంత తల్లిదండ్రులు ను మర్చిపోయి ఇతర దీక్షలు వేస్తున్నారు ఇది. సరియైన ది కాదు ఏ ఇతర దీక్షలు రాకముందు గోండులు పుష్య మషంలో బవెయ్ మాసంలో రెండు నెలలు దీక్ష తీసుకొని పాటించేవారు.అప్పుడు మన రాజ్యాలు,ఆరోగ్యం, ఐశ్యర్యాలు కాలిగేవి కానీ ఇప్పుడు మర్చిపోయారు కనుక ఇప్పుడు ఆడుకునే పరిస్థితి వచ్చింది.దీక్షయా గురు సమావేశంలో మాట్లాడుతూ ఈ గ్రామంలో ప్రారంభించడానికి ముందు పెంధోర చిత్రు తో ప్రారంభం అయింది. ఈ దీక్ష వలన క్రమశిక్షణ కలిగి వ్యక్తిత్వ నిర్మాణం జరుగుతుంది కనుక చేడు అలవాట్లు దూరం అవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనిషి చైతన్యం చెంది అభివృద్ధి అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. శ్రీధర్ జంగుబాయి గురుంచి పాట ఆడియే విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో ఆత్రం రఘునాథ్. జంగో లింగో ఘన సంస్థాన్ అధ్యక్షులు,పుర్క బాపురావు, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి, పెంధోర్ ప్రభాకర్ న్యాయవాది,పెంధోర్ అర్జు ఏటీఫ్ జిల్లా అధ్యక్షులు, పెంధోర్ పుష్పరాని ఆదివాసీ మహిళ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్కా యధోరవు పటేల్ ,కనక లచ్చు పటేల్  సర్పంచ్ ఛాహకటి అభిమాన్ ,కథేలే శ్రీధర్ ,మాడవి  రాజేశ్వర్,అడా షేకు,మంగం విషంరావు,తెలంగాణ చిత్ర కళాకారులు, కోడప నగేష్ తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నాగోబా స్వామి పెంధోర్ శంభు,అమృతు రావు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: