CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాష్ట్ర స్థాయి ఇన్స్ పైర్ ప్రదర్శన నుండి జాతీయ స్థాయికి ఎంపిక అయిన రాజుపేట యువకుడు

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండలం లోని రాజుపేట గ్రామానికి చెందిన జమీల్ అక్రమ్ (బడా మోల్ సాబ్ ) కుమారుడు జునైద్ అక్రమ్ బయ్యారం ఎక్సలెంట్   స్కూల్ లో పదవతరగతి చదువుచున్నాడు. తాను ఇదివరకు మాడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ఇన్స్ ఫైర్ ప్రదర్శనకు గాను రాష్ట్ర స్థాయి కి ఎంపిక అయిన విషయం విదితమే, ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి కి ఇన్స్ ఫైర్ ప్రదర్శన కు ఎంపిక అయ్యాడని ఎక్స్ల్లెంట్ స్కూల్ బయ్యారం యాజమాన్యం యూసుఫ్, నరేందర్, ప్రిన్సిపాల్ సురేష్ తెలియజేశారు. ఈ విషయం పై మన్యం టీవీ  జునైద్ అక్రమ్ ను కలిసి జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ ప్రదర్శనకు ఎంపిక అయినందుకు మీకు దోహద పడిన వారు ఎవరు అని అడగ్గా ముందు నా తల్లి తండ్రులు నాకు అన్ని వేళల ముందుండి నడిపించారు ప్రదర్శనకు ముందు ఎన్నో సార్లు రీహార్శల్  మోడల్ ప్రాజెక్ట్స్ కు ఎంత కావాలి అంటే అంత డబ్బు ఇచ్చారు, నాకు పూర్తి స్వేచ్చను ఇచ్చి నాపై నమ్మకం ఉంచిన నా తల్లి తండ్రులు నాకు పరోక్షంగా దోహదపడ్డారు. ప్రత్యేకంగా మా స్కూల్ యాజమాన్యం నరేందర్, ప్రిన్సిపాల్ సురేష్ నన్ను ప్రోత్సాహించారు. ప్రత్యక్షంగా మా ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు జానకిరామ్, శ్రావణి, వలసలా మోహన్ అన్ని విషయాలు చాలా చక్కగా తెలియజేసి నన్ను నువ్వు సాధించగలవు అని నన్ను ప్రోత్సహించి నాలో ధైర్యాన్ని నింపి మోడిఫైడ్ మాన్ హోల్ సిస్టం ఇన్స్ఫైరింగ్ ప్రదర్శన రాష్ట్ర స్థాయికి, అక్కడ నుండి జాతీయ స్థాయికి ఎంపిక అవటానికి నా కృషి తో పాటు మా ఉపాధ్యాయుల కృషి కూడ మరువలేనిది అని జునైద్ అక్రమ్ తెలియజేసారు.

Share it:

TELANGANA

Post A Comment: