CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గిరిజనేతరులకు చేసిన అక్రమ పట్టాలు రద్దు చేయాలి

Share it:

 


గిరిజనేతరుల చేతిలో వున్న ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలి


ఆదివాసీ నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు పూనేం సాయి


నూగూరు వెంకటాపురం


ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా , గిరిజనేతరులకు చేసిన  అక్రమ పట్టాలను రద్దు చేయాలని పూనేం సాయి డిమాండ్ చేసారు.ఆదివాసీ నవ నిర్మాణ సేన ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి మడకం రవి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో జరిగింది.ఈ సమావేశంలో ఏ ఎన్ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు పూనేం సాయి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు, వెంకటాపురం మండలాల్లో  1/70 చట్టానికి విరుద్దంగా గిరిజనేతరులకు అక్రమ పట్టాలు చేశారన్నారు.తక్షణమే ఈ అక్రమ పట్టాలను రద్దు చేయాలని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కోరడం జరిగింది అన్నారు. గిరిజనేతరుల చేతిలో అక్రమంగా  వున్న ప్రభుత్వ భూములను రెవిన్యూ శాఖ వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు.ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోకపోతే ఆదివాసీ నవ నిర్మాణ సేన ఆధ్వర్యంలో న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.నూగూరు (జడ్ )కొంతమంది గిరిజనేతరులు అక్రమంగా పట్టాలు చేయించుకొని క్రయ,విక్రయాలు చేస్తూ రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న ,రెవిన్యూ  శాఖ చూసి చూడనట్టు వ్యవహరిస్తుందని మండి పడ్డారు. 1/70 చట్ట ప్రకారంగా ఏజెన్సీలో గిరిజనేతరులకు భూ రిజిస్ట్రేషన్ లేవన్నారు.నూగూరు(జెడ్) లో అక్రమ పట్టాలపై ,అక్రమ రిజిస్ట్రేషన్ల పై సమగ్ర విచారణ చేయాలని,ములుగు కలెక్టర్ ను,గిరిజన సంక్షేమ శాఖకు  వివరించనునట్లు ఆయన తెలియ చేశారు.గిరిజనేతరుల   అక్రమ పట్టాల పై సమగ్ర విచారణలో బట్ట బయలు అయిన వెంటనే 6(ఎ),6(బి) క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.పార్టీలను అడ్డు పెట్టుకొని వందల ఎకరాలు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని,ఆదివాసీల మీద,ఆదివాసీ చట్టాల మీద ఆధిపత్యం చాలయిస్తున్నారని అన్నారు.ఈ భూర్జ్వా రాజకీయ పార్టీల   ఆధిపత్యం ఆదివాసీ గుడాలల్లో చెల్లదన్నారు.ధన బలం,రాజకీయ బలాన్ని ఉపయోగించి ఆదివాసీ సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నా రన్నారు.ఇలాంటి తాటాకు చప్పులకు ఆదివాసీ సంఘాల నాయకుల మైన మేము భయపడబోమన్నారు.ఆదివాసీ చట్టాల పక్షాన మాట్లాడని ఏ రాజకీయ పార్టీని వదలబోమన్నారు. ఆదివాసీ ప్రజల  జోలికి వస్తే ఎంతటి వారి నైనా వదిలే ప్రసక్తి లేదన్నారు.గత వారం రోజులుగా ములుగు జిల్లా కలెక్టర్ ఏజెన్సీలో ని గిరిజనులకు గిరిజనేతరులకు మధ్య ఉన్న,గిరిజనేతరులకు గిరిజనేతరుల కు మధ్య ఉన్న భూ తగాదాలను   పరిష్కరిస్తున్నాము అని అంటున్నారు. ముందు గిరిజనేతరుల చేతుల్లో అక్రమంగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను తేల్చి గిరిజనేతరుల పట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఏజెన్సీలో భూ సమస్యలను 1/70 చట్ట పరిధిలో పరిష్కరించేసులన్నారు.  ఈ కార్యక్రమంలో సూర్యం,నరేష్, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: