CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ ఫైనల్స్ కు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్& పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం లోని బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న యూసఫ్ మెమోరియల్ క్రికెట్ కప్ ఫైనల్స్ మంగళవారం జరిగాయి. హోరా హోరీగా సాగిన ఫైనల్లో భద్రాచలం మరియు సారపాక జట్ల మధ్య  జరిగిన ఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన యువ ఎలెవన్ భద్రాచలం జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 9 విక్కెట్లు కోల్పోయి 196 భారీ  పరుగులు చేసింది. 197 పరుగుల విజయ లక్ష్యం తో బరిలోకి దిగిన శరన్ ఎలెవన్ సారపాక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. భద్రాచలం జట్టు లోని బ్యాట్మాన్ కిరణ్ 58 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు.


ఈ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్ జడ్పీటీసీ శ్రీమతి కామిరెడ్డి శ్రీలత - రామకొండా రెడ్డి దంపతులు,PACS చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు గోపీరెడ్డి రమణరెడ్డి,టిఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్,మాజీ జడ్పీటీసీ బట్టా విజయాగాంధ , జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ జాన్సన్, ఆర్గనైజింగ్ కమీటీ సభ్యులు సోహైల్ పాషా, సర్వేశ్వరావు, గోనెల నాని,భజన సతీష్, అబ్దుల్ సలీమ్, భజన ప్రసాద్, సారధి,అబ్దుల్ నయీమ్ మరియు తదితరులు పాల్గొన్నారు.



1. టోర్నీ మాన్ అఫ్ ది సిరీస్ - మందా ప్రసాద్ (భద్రాచలం యువ XI)

2. బెస్ట్ బ్యాట్మాన్ - భరత్ (నాయక్స్ XI కొత్తగూడెం)

3. బెస్ట్ బౌలర్ - ఇంతియాజ్ (శరన్ XI సారపాక)

4. బెస్ట్ కీపర్ - కుమార్ (నాయక్స్ XI కొత్తగూడెం)

5. బెస్ట్ ఫీల్డర్ - నాగ (శరన్ XI సారపాక)

Share it:

TELANGANA

Post A Comment: