CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇర్ప రవి స్మారక రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ క్రీడలు పారంభం.చర్ల

Share it:

 



 మన్యం టీవీ చర్ల: 


చర్ల మండలం జూనియర్ కళాశాల లో ఖమ్మం జిల్లా టార్గెట్ బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ  రాష్ట్రస్థాయి టార్గెట్ బాల్ పోటీలు ప్రారంభం అయ్యాయి . ఈ కార్యక్రమానికి ముఖ్యఅదితిగా  భద్రాచలం ఎమ్మెల్యే పొదేం విరయ్య  పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేసి పది జిల్లాల నుండి వాచ్చినటువంటి క్రీడాకారుల నుండి క్రీడా వందనం స్వీకరించారు. తరువాత  క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ నా నియోజకవర్గం లో తెలంగాణ జిల్లాల నుండి ఇక్కడకు వచ్చి అడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. క్రీడాకారులు ద్వారానే రాష్టానికి దేశానికి గుర్తిపు వస్తుంది కావున మీరు మా భద్రాచలంకె కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మన భారత దేశానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు తేవాలని పిలుపునిచ్చారు.తెలంగాణ టార్గెట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్  ఎం.వినోద్ రెడ్డి , తెలంగాణ సెక్రటిరీ  రేవంత్  మాట్లాడుతూ తెలంగాణ మారుమూల ప్రాంతం అయినటువంటి చర్ల లో నా మిత్రుని రవి స్మారక రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ టౌర్నమెంట్ ఇక్కడ పెట్టడం సంతోషం అదేవిదంగా ప్రతి సంవత్సరం జరిగే  సీనియర్ టార్గెట్ బాల్ పోటీలను తెలంగాణ లో ఏ జిల్లాలో జరుగిన కూడా వాటిని స్వర్గీయ ఇర్ప రవి గారి పెరుమీదనే నిర్వస్తాము అని మాట ఇవ్వడం జరిగినది.తెలంగాణ కోశాధికారి ఎం.డి  అన్వర్ పాషా , తెలంగాణ జాయిట్ సెక్రటరీ  శ్రీధర్ పటేల్ , చర్ల జడ్పిటిసి ఇర్ప శాంతి , చర్ల ఎంపీపీ కోదండ రామయ్య , ఎంపీడీవో  వివేక్ రామ్ ,చెర్ల సర్పంచ్ కృష్ణార్జున రావు ,టౌర్నమెంట్ అబ్సెర్వేర్ కిరణ్ గౌడ్ , ఖమ్మం ఎస్ జి ఎఫ్ ఐ ప్రెసిడెంట్  వెంకటేశ్వర్లు , టౌర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ  వినోద్ కుమార్ , శ్రీను ,తిరుపతి రావు, కన్నారావు,ఈశ్వర్, సందీప్, ధష్మీ బాబు, బుజ్జి బాబు,శ్రీను,కమలాకర్, ముకేశ్, గ్రామ ప్రజలు ,యువకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: