CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీ మహిళకు ఉత్తమ ఉద్యోగి గా అవార్డు

Share it:

 



 *అవార్డు అందుకున్న  సిద్దబోయిన రాజ్యలక్ష్మి.


మన్యంటీవీ ఏటూరునాగారం:


ఈరోజు ములుగు జిల్లా కేంద్రంలో  జరిగిన 72వ గణతంత్ర దినోత్సవం వేడుకలలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి చెందిన  సిద్దబోయిన రాజ్యలక్ష్మి జిల్లాలో ఉత్తమ మెడికల్ మరియు హెల్త్ ఉద్యోగి గా అవార్డు  అందుకున్నారు.  సిద్దబోయిన రాజ్యలక్ష్మి మేడారం, ఊరట్టం  గ్రామపంచాయతీ లో ఏఎన్ యం గా  నిర్వహిస్తున్నారు. ఈరోజు ములుగు లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ములుగు అదనపు కలెక్టర్  ఆదర్స్ సురభి మరియు ములుగు ఏఎస్పీ  సాయి చైతన్య చేతులు మీదుగా అవార్డు అందుకున్నారు.గత సంవత్సరం జరిగిన శ్రీ సమ్మక్క సరళమ్మ మేడారం జాతర లో  మరియు కరోనా మహమ్మారి సమయంలో స్థానిక ప్రజలకు అను నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించిందుకు ప్రభుత్వం గుర్తించి  అవార్డు అందించినందుకు మేడారం, ఊరట్టం గ్రామపంచాయతీ లలో ప్రజలు హార్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్బంగా అవార్డు గ్రహీత

 సిద్దబోయిన రాజ్యలక్ష్మి   సురేందర్ ( సమ్మక్క ప్రధాన పూజారి )మాట్లాడుతూ నేను చేసిన సేవలను గుర్తించి ములుగు జిల్లా లో ఉత్తమ ఉద్యోగి గా ఎంపిక చేసి,అవార్డు ఇచ్చినందుకు జిల్లా వైద్య అధికారి అల్లెం అప్పయ్య మరియు మండల మెడికల్ ఆఫీసర్ అవినాష్ కు మరియు మేడారం, ఊరట్టం రెండు గ్రామపంచాయతీ లలోని  ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: