CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిర్చి సాగు లో బైబ్యాక్ ఒప్పంద పద్ధతి తోనే రైతులకు ఆర్థిక ప్రయోజనం......

Share it:

 


ఆంధ్రాలో మిర్చి రైతులు బైబ్యాక్ పద్ధతిలో లబ్ధి పొందుతున్న తీరు అభినందనీయం


అధునాతన పద్ధతి సాగుతోనే మిర్చి సాగు లో అధిక దిగుబడులు, అదనపు రాబడులు

 

 జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి


ముగిసిన ఒక రోజు ఆంధ్ర పర్యటన....

మన్యం టీవీ మంగపేట. 

మిర్చి సాగు లో బై బ్యాక్ ఒప్పంద పద్ధతి తోనే రైతులకు అధిక లాభాలు, అదనపు రాబడులు  సాధ్య పడతాయని ""జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్"" డైరెక్టర్ నాసిరెడ్డి .సాంబశివ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మిర్చి రైతుల సమస్యలు, సాగు తీరు పరిశీలించేందుకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని లోని విలీన మండలాల్లో పర్యటించారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని ఎటపాక, కూనవరం, వి.ఆర్.పురం మండలాల్లో మహికో సీడ్స్ ఆధ్వర్యంలో బైబ్యాక్ పద్ధతిలో పండిస్తున్న మిరప పంట క్షేత్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సాంబశివరెడ్డి  మాట్లాడుతూ, మిరపలో బైబ్యాక్ పద్ధతిలో ఐ పి ఎం, ఆర్గానిక్, మరియు నాన్ ఐపీఎం పద్ధతుల్లో పండిస్తున్న మిర్చి పంట బైబ్యాక్ పద్ధతిలో వివిధ సంస్థలు కొనుగోలు చేస్తుండడంతో ఇక్కడ రైతాంగం ఎకరానికి రూపాయలు 40 వేల నుండి 50 వేల వరకు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటున్నారనీ, అదేవిధంగా డ్రిప్, మల్చింగ్ పద్ధతి పాటించి తక్కువ పెట్టుబడితో నాణ్యతతో కూడిన ఎక్కువ దిగుబడులు పొందుతున్నారని అన్నారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పండిస్తున్న మిర్చితో పోల్చుకుంటే,ఆంధ్రాలో  జెమిని వైరస్, విల్టు సమస్య చాలా తక్కువగా ఉందన్నారు. మన ప్రాంతం లాగే, గోదావరి పరివాహక ప్రాంతం కావడం వల్ల మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన మిర్చి ఈ ప్రాంతంలో పడుతుందన్నారు. మహికో తోపాటు ఐ టి సి, ఏ వి టి, కృషి ఖాన్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, త్వరలోనే ఏటూరునాగారం, చర్ల, మణుగూరు ప్రాంతాల్లో వచ్చే ఏడాది నుంచి బై బ్యాక్ పద్ధతిన మిర్చి సాగు ప్రోత్సహించేందుకు  కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బైబ్యాక్ మిరప సాగులో లాభనష్టాలు, సాగులో మెలకువలు, పద్ధతులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు గురించి  అక్కడి రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహికో క్యాపిక్ అనే వంగడం జెమినీ వైరస్ ను సమర్ధవంతంగా తట్టు కోవడంతో పాటు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వస్తుందని రైతులు సాంబశివ రెడ్డి కి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహికో సీడ్స్ సౌత్ జోనల్ మేనేజర్ హెచ్. బస్వరాజ్, పోక్యూర్ మెంట్ మేనేజర్ వెంకటేశ్వర్ రెడ్డి, సంస్థ ప్రతినిధులు వేణు, సుధా చందర్ తేజ, వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్ చెట్టుపల్లి. తిరుపతి రావు మరియు ఆయా మండలాల రైతులు పాల్గొన్నారు....

Share it:

TELANGANA

Post A Comment: