CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండలంలో విప్ రేగా విస్తృత పర్యటన

Share it:

 


- దుగినే పల్లి  మాజీ సర్పంచ్ కు 6500 ట్రస్ట్ ద్వారా  సహాయం 

- వివాహ,ఓదార్పు , సహయక, అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న రేగా

మన్యం టీవి,పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండల వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు విస్తృత పర్యటన చేశారు. మొదటగా మండల పరిధి లోని అమరారం గ్రామానికి చెందిన కురసం స్వప్న ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అక్కడ నుండి జానంపేట గ్రామం దుబ్బ గుంపులో 14 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించారు. డి ఈ బ్రహ్మ దేవ్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు . అక్కడ నుండి టి.కొత్తగూడెం గ్రామానికి చేరుకొని అనారోగ్యానికి గురైన పాడి దామోదర్ రెడ్డి ని పరామర్శించారు. అనంతరం దుగినే పల్లి గ్రామ పంచాయతీకి చెందిన చెందిన మాజీ సర్పంచ్ సుంకర ముత్తయ్య అనారోగ్యంతో బాధ పడుతున్న విషయం తెలుసుకొని ఆయన నివాసానికి వెళ్లి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోరూ. 6వేల500 నగదును ఆయనకు అందించారు. అక్కడ నుంచి పినపాక చేరుకొని సోంపల్లి ప్రశాంత్ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం 

తోగూడెం గ్రామానికి చేరుకొని  పోడు సాగు దారులతో మాట్లాడారు. వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. పోడు సాగు రైతులు ప్రభుత్వ భూములను ఫారెస్ట్ వారు అక్రమంగా ఆక్రమించుకుని రైతుల పై దౌర్జన్యం చేస్తున్నారని ఆయనకు వెల్లడించారు. పోడు సాగు రైతులకు అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఎంపీపీ గుమ్మడి గాంధీ, జడ్పిటిసి సుభద్రాదేవి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు  దాట్ల వాసు బాబు, కొండేరు రాము, కొండేరు నాగభూషణం, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, దొడ్డ శ్రీనివాసరెడ్డి,బుస్సి శ్రీను, టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు సందీప్ రెడ్డి,కునారపు రాము,బండ మనోజ్ రెడ్డి సర్పంచులు ,ఉప సర్పంచులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: