CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఈ ఆకుకూరతో వంద రకాల రోగాలకు చెక్

Share it:

         



చుక్కకూర నే పుల్ల బచ్చలి అని కూడా పిలుస్తారు. దీనిలో రెండు రకాల జాతులు కలవు. అవి చుక్కకూర, చిన్న చుక్కకూర. అందరికీ తెలిసిందే, అందరికీ అందుబాటులో ఉండే ఆకు కూర. చాలా తేలికగా జీర్ణమై శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. నోటి కి పుల్లగా ఉండి మంచి రుచిని కలిగిస్తుంది. దీనిని పప్పులో కలిపి వండుకోవచ్చు. దీనిని కూరగాను,పులుసు గాను, పచ్చడిగాను అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఇతర కూరగాయలతో కలిపి వండుకోవచ్చు. పైత్యతత్వం గల వారికి పైత్య రోగాలకు ఈ ఆకుకూర తినడం వల్ల ఎంతో మేలు గా ఉపయోగపడుతుంది. చుక్కకూర ఆకును ఒక రసం ఒక ఔన్స్ తీసి పెరుగులో కానీ, పాలతో కానీ కలిపి తాగితే 3 రోజుల్లో కామెర్ల వ్యాధి తగ్గుతుంది. అనేక రకాల చర్మ వ్యాధులను తగ్గిస్తుంది.త్వరగా జీర్ణంకాని దుంపకూరలు, పప్పు దినుసులతో ఈ ఆకు కలిపి వండితే త్వరగా జీర్ణం అయ్యేటట్లు చేస్తుంది. చుక్క కూర ఆకు రసంలో చిటికెడు సోడా ఉప్పు కలిపి తాగితే కడుపు నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. గ్రహణి, అతిసార వ్యాధుల్లో చుక్కకూర పథ్య ఇవ్వడం వల్ల సులభంగా తగ్గుతాయి.

చుక్క కూర ఉపయోగాలు:

1.జీర్ణశక్తిని పెంచుతుంది

2.శుల ను హరించును

3.చెవి పోటు ను తగ్గించును

4.హృదయ వేదనను తగ్గించును

5.కామెర్ల వ్యాధి తగ్గుతుంది

6.ముక్కు వెంట రక్తం కారుట ను తగ్గించును

7.కడుపునొప్పిని తగ్గించును

8.శరీరంలోని చెడు నీరును కలిగించును

9.మలబద్ధకం ను తొలగించి సుఖ విరేచనం కలిగించును

10.మల మూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది

11.వేడి శరీరం కలవారు కి ఈ కూర చాలా మేలు చేయును

12.జీర్ణకోశంలో ఏర్పడే మంటని వేడిని ఇది తగ్గించును

13.శరీరం నందు ఉత్సాహాన్ని కలిగిస్తుంది

14.వాంతులు అరికట్టి డంలో ఈ కూర అద్భుతంగా పని చేయను

15.చుక్క ఆకు వెచ్చచేసి దాని రసం చెవిలో పిండితే చెవిపోటు నయమగును.


సేకరణ-

మన్యం టీవీ, అశ్వాపురం రిపోర్టర్ జక్కుల సందీప్.

Share it:

TELANGANA

Post A Comment: