CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జర్నలిస్తులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లో ప్రభుత్వం విఫలం

Share it:

 


-సీతక్క యువసేన మండల అధ్యక్షులు చెర్ప రవీందర్. 


మన్యం టీవీ తాడ్వాయి. 


ప్రజాస్వామ్యం లో నాలుగో స్థంభం లాంటి జర్నలిస్ట్ లకు తాడ్వాయి

మండలం లో జర్నలిస్తులకు తాడ్వాయి లో ఇంటి స్థలాలు ఇవ్వడం లో తెరాస ప్రభుత్వం ఘోరం గా విఫలం అయింది అని సీతక్క యువసేన మండల అధ్యక్షులు ఆరోపించారు.ఈరోజు తాడ్వాయి మండలం ఊరట్టం గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశం లో రవీందర్ మాట్లాడుతూ సమాజం లో అన్ని వర్గాలను మాయమాటలతో మోసం చేసినట్లే, సమాజం లో నిరంతరం పని చేసే,  ఎంతో చైతన్యవంతులు అయినా జర్నలిస్తులను కూడా తెరాస ప్రభుత్వం మోసం చేసింది అని, రాష్ట్రము ఏర్పాటు కాకముందు ప్రతి సభ లో తెలంగాణ వస్తే  జర్నలిస్తులకు ఇల్ల స్థలాలు ఇస్తాము అని కెసిఆర్ ప్రగల్బాలు పలికాడని అన్నారు. 2014 మరియు 2018 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో లలో కూడా జర్నలిస్తులకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని చెప్పిన ప్రభుత్వం, అంతే కాదు జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం లో తాడ్వాయి వచ్చిన మంత్రి దయాకర్ రావు కూడా  హామీ ఇచ్చి కూడా  ఇంతవరకు ఈ మండలం లో సెంట్ జాగా కూడా ఇవ్వలేదని, ఈరోజు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలిచే విధంగా, ప్రజల సమస్యలు ప్రభుత్వం కు తెలిసే విధంగా జర్నలిస్ట్ ఎలాంటి ప్రతిఫలం లేకుండా పని చేస్తున్నారు అని వాపోయారు.  ప్రతి మేడారం జాతర సమయంలో, మరియు కరోనా  కష్టకాలం లో జర్నలిస్టులు ఎంతో   సేవలు అందించారని పేర్కొన్నారు.  వచ్చే ఎన్నికల లో ములుగు అసెంబ్లీ కి పోటీ చేసే మంత్రి సత్యవతి రాథోడ్ ఈ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు, జర్నలిస్తులకు తాడ్వాయి మండల కేంద్రం మేడారం రోడ్డు లో ఉన్న ప్రభుత్వ స్థలం లో  ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అని త్వరలో ములుగు ఎమ్మెల్యే సీతక్క ద్వారా కలెక్టర్ ద్రుష్టి కి మేమే తీసుకెళ్తాము అని అన్నారు. ఈ కార్యక్రమం లో   కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు కొక్కెర పూర్ణ చందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేర్ప ధనార్జన్ రావు, చేర్ప వీరమోహన్ రావు, గొంది లక్షమన మూర్తి, చేర్ప వీరమోహన్ రావు, గుండ్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: