CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మూడో రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ బైక్ ర్యాలీ

Share it:


     


మన్యం టీవీ,దమ్మపేట:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట లో 26/1/2021 కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేయాలని అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ,జయలక్ష్మీ టాకీస్ నుండి మందల పల్లి హైవే వరకు ర్యాలీగా కొనసాగిది.అనంతరం సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కర్ రావు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు నాయుడు చెన్నారావు,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్,సిపిఐ ఎమ్మెల్ అమర్లపూడి రాము,సిపిఎం జిల్లా నాయకులు దొడ్డ లక్ష్మీనారాయణ,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గం నుండి మడక రమణ, మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను తక్షణం రద్దు చేయాలని ఢిల్లీలో 60 రోజులుగా చట్టాలను రద్దు చేయాలని రైతులు వివిధ రూపాల్లో పోరాటాలు కొనసాగిస్తున్నారని వారికి సంఘీభావంగా 60 రోజుల నుండి కూడా వివిధ రూపాల్లో దమ్మపేట మండలం లో పోరాటాలు కొనసాగిస్తున్నామని ఈ మూడు చట్టాలను రద్దు చేసే వరకు విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేసే వరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని 60 రోజులుగా ఢిల్లీ నలుమూలల లక్షలాది మంది రైతులు పోరాటాలు కొనసాగిస్తున్నారని ఈ రోజున సుమారు మూడు లక్షల ట్రాక్టర్లతో రైతులు ఢిల్లీ నలుమూలల నిరసన తెలియజేస్తున్నారు అని అయినా గాని ఈ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కి  సిగ్గు శరం లేదని ఈ చట్టాలను రద్దు చేస్తావా ప్రధానమంత్రి పదవి నుండి తప్పుకుంటారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయినా ఈ నరేంద్ర మోడీ పెట్టుబడిదారులు పక్షానే కొమ్ముకాస్తున్నారని వారి పక్షాన లేకపోతే  పదవి పోతుందనే భయంతో  ఉన్నాడని  రైతులతో పెట్టుకునే ఏప్రభుత్వం కూడా కొనసాగలేదాని  ఈ సందర్భంగా గా కేంద్ర ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జానీ కందుల, వెంకటేశ్వరరావు,చిట్టి బాబు, తెలుగుదేశం నాయకులు ఎండి వాలి భాష,గడ్డిపాటి సత్యం, పానుగంటి రామారావు, చిరంజీవి,సిపిఎం మారంపూడి శ్రీనివాసరావు,పిల్లి నాయుడు, కొప్పుల శ్రీను,రావుల శోభనం, సిపిఐ ఎంఎల్ దుర్గ అక్క, సంధ్య,కారం ప్రసాదు,కాక వెంకటేష్,సిపిఐ ఎంఎల్ చంద్రన్న,రాయల జ్యోతి,సిపిఐ మండల కార్యదర్శి తంగెళ్ళమూడి శివకృష్ణ, నల్లబోతుల నాగార్జున, కల్వకుంట్ల సత్యనారాయణ, తోట శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: