CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిసిసి సేల్స్ మెన్ ఎస్ కుమార్ పై వస్తున్న ఆరోపణల గురించి విచారణ చేపట్టిన,జిసిసి డిఎం కుంజా వాణి

Share it:


  మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిసిసి వారి భారత్ పెట్రోల్ బంక్ ఇంచార్జ్,అన్నపురెడ్డిపల్లి జిసిసి రేషన్ షాప్ సేల్స్ మెన్ సందెవేన కుమార్.పెట్రోల్ బంక్ లో శాంపిల్ టెస్టింగ్ కొరకు తీసిన పెట్రోల్,డీజిల్ బ్లాక్ లో అమ్ముతూ,అక్రమాలకు పాల్పడుతున్నాడని,ఆదివాసీ గిరిజనులు,పెట్రోల్ బంక్ గిరిజన సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ,దుర్భాషలాడుతున్నాడని,రేషన్ షాప్ కు ప్రభుత్వం నుండి వచ్చిన సన్నబియ్యం నిల్వ ఉంచుకొని దొడ్డు రకం బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాడు అని,ఎవరైనా అడిగితే ప్రభుత్వం నుండి దొడ్డు రకం బియ్యం మాత్రమే వస్తున్నాయని అబద్ధాలు చెబుతూ రేషన్ షాప్ నందు కూడా గిరిజనులతో అహంకార ధోరణిలో మాట్లాడుతన్నాడని,ఎంపిపి సున్నం లలితకు గిరిజనులు ఆవేదన విన్నవించుకోగా, మండల ప్రథమ పౌరురాలైన ఎంపీపీ ఫోన్ లో సంభాషించగా వారి పట్ల కూడా గౌరవం లేకుండా నిర్లక్ష్య ధోరణిలో మాట్లాడాడని,ఆదివాసీ గిరిజనులను చిన్న చూపు చూస్తూ చులకనగా మాట్లాడుతున్నాడని.ఇదే తరహాలోనే పెట్రోల్ బంక్ నందు పనిచేస్తున్న గిరిజన యువకులు,మహిళలతో కూడా సత్ప్రవర్తన లేకుండా ప్రవర్తిస్తున్నాడని.భద్రాచలం ఐటిడిఎ పిఓ గారికి విన్నవించుకోగా,వారి ఆదేశాల మేరకు జిసిసి డిఎం కుంజా వాణి, టాస్క్ఫోర్స్ సిబ్బంది విచారణ జరిపి రేషన్ షాప్ నందు సోదాలు నిర్వహించగా నిల్వ చేసిన 49 క్వింటాళ్ల సన్న బియ్యంని గుర్తించి,సీజ్ చేశారు.ఈ విచారణలో ఎంపిపి సున్నం లలిత,పెట్రోల్ బంక్ గిరిజన సిబ్బంది,మండల గిరిజనులు తదితరులు ఉన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: