CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరుణ చూపిన కారుణ్య పు ఉద్యోగుల మిత్రమండలి సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

మణుగూరు ఏరియా పీకే ఓసి టు బేస్ వర్క్ షాప్ డంపర్ మెయింటెన్ సెక్షన్ నవీన్ నరేష్ ఉద్యోగుల ఆధ్వర్యంలో కిడ్నీ బాధితురాల కు మానవతా దృక్పథంతో వితరణ శుక్రవారం నాడు డంపర్ మెయింటెన్ సెక్షన్ నందు కిడ్నీ బాధితులకు నవీన్ నరేష్ మిత్రమండలి సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్ ఆధ్వర్యంలో కలెక్ట్ చేసిన 15 వేల రూపాయలను ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలీషా, టిబిజికెఎస్ సంఘం నేత ప్రభాకర్ రావు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రాజెక్టు ఇంజనీర్ గారు మాట్లాడుతూ, సాటివారికి సహాయం చేసే ఆనందం కోట్లకు పడగెత్తిన కోటీశ్వరులకు దొరకదని, కష్టించి పనిచేసే ఉద్యోగుల్లో మానవత్వం సహాయం చేసే గుణగణాలు ఎక్కువగా ఉంటాయని అందులో మెయింటెన్ సెక్షన్ లో ఉన్న మన ఉద్యోగులు ఇలాంటి సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి దాతలు అని ప్రశంసల జల్లులు కురిపించారు. పదిమందికి సహాయపడే గుణం ఉండాలి అని మన పెద్దలు చెప్పిన సూక్తులను తూచా తప్పకుండా పాటించాలని భావితరాల వారికి ఆదర్శం గా నిలుస్తాయని అందుకు నిదర్శనమే నవీన్ నరేష్ ఉద్యోగులు ఇందుకు స్ఫూర్తిదాయక మని అతి చిన్న వయసులో సాటివారి మేలుకోసం సహాయం చేసే పెద్ద మనసు వారికి ఉన్నందుకు వారిని అభినందించాలని ప్రతి ఉద్యోగి లో ప్రేమ దయ జాలి మానవత్వం ఉన్ననాడే పదిమందికి సాయపడే సాయపడగలరు అని తద్వారా సమాజ శ్రేయస్సు శాంతి గమనంలో ప్రయాణించగలదు అని ఎలీషా గారు పేర్కొన్నారు.

టిబిజీకేస్ సంఘం నేత  ప్రభాకర రావు మాట్లాడుతూ కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగంలో చేరిన నవీన్ నరేష్ మిత్రమండలి సభ్యులకు అందరికీ టిబిజికేఎస్ యూనియన్ తరపున అభినందిస్తున్నానని చిన్న వయసులో ఎంతో పెద్ద మనసుతో సాటివారికి సహాయపడే ఆలోచనలతో కిడ్నీ బాధితులకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడం స్పూర్తి దాయకమని అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో బేస్ వర్క్ షాప్ సూపర్డెంట్ ఇంజనీర్ రాజశేఖర్, ఇంజనీర్ వెంకటేశ్వర్లు, ఫోర్ మెన్ నారాయణ,గుర్తింపు సంఘం నేతలు అబ్దుల్, కోట శ్రీనివాసరావు, కాపా శివాజీ, సిహెచ్ అశోక్, కే రాజేశ్వరరావు, జగదీష్ శివ రావు, సత్యనారాయణ, జీవరత్నం, శ్రీనివాస్, తాజుద్దీన్ ,అన్వర్ భాష, సుధాకర్, రాములు, మరియు సోషల్ సర్వీస్ ఫర్ హంగ్రీ లీవ్స్ సభ్యులు

సూర్య తేజ,చటర్జీ, గురుమూర్తి,జాఫర్,దిలీపు, లతో పాటు డంపర్ మెయింటెనెన్స్ సెక్షన్ ఉద్యోగులు అధికారులు సూపర్వైజర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: