CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీఎం కేటీఆర్.. తేల్చేసిన మంత్రి ఈటల రాజేందర్‌

Share it:



కీలక సందర్బాల్లో కేటీఆరే ముఖ్యమంత్రిపాత్ర పోషిస్తున్నరు


హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:

తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌ అంటూ గత కొద్దిరోజులుగా సాగుతున్న ప్రచారంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖామంత్రి ఈటల రాజేందర్‌ స్పందించారు. ఆదివారం రాత్రి ఓ మీడియాఛానల్‌ ఇంటర్వ్యూలో ఆయన ముఖ్యమంత్రి అంశంతో పాటు టీఆర్‌ఎస్‌ పార్టీ, పాలనకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదని మీడియా ప్రతినిధి అడిగినప్రశ్నకు మా దగ్గర 99శాతం ముఖ్య కార్యక్రమాలు కేటీఆర్‌ గారే చూస్తారు. ముఖ్యమంత్రి గారి పాత్ర పోషిస్తరు. ఇపుడు కూడా హాజరయ్యారు అని బదులిచ్చారు. ఫిబ్రవరి లేదా మార్చిలోనే ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ అయ్యే అవకాశముందని, తేదీలు కూడా ఫిక్సయ్యాయి అని చెబుతున్నారన్న ప్రశ్నకు ఉంటే.. ఉండొచ్చు. తప్పకుండా. తప్పేముంది అందులో అని బదులిచ్చారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసి ఎన్నికలే కాక.. 32జిల్లా పరిషత్‌ స్ధానాలు గెలిచినపుడు, 88 అసెంబ్లి స్థానాలు వచ్చినపుడు కూడా పార్టీలో సమీక్షించుకున్నామని తాజా పరిణామాలపై వ్యాఖ్యానించారు. పార్టీ ఎప్పటికపుడు ప్రజల్లో మా పట్ల ఉన్న అభిప్రాయాన్ని బేరీజు వేసుకుని ముందుకు సాగుతుందన్నారు.


Share it:

TELANGANA

Post A Comment: