CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సంక్షేమ పథకాలు అడ్రస్సే లేవు అక్కడ ఆదివాసీ ల జీవనం అగమ్య గోచరం

Share it:
 మన్యంటీవీ,అశ్వారావుపేట:


👉 తిమ్మాపురం గ్రామం ఏర్పడి 23 ఏళ్లు


👉 అయినా రాజ్యాంగబద్ధ హక్కులకు దూరం


👉 ప్రాథమిక హక్కులకు నోచుకోని ప్రజలు


 👉 కరెంటు లేదు నీళ్లు లేవు


👉 ఊరు ఖాళీ చేయండంటూ ఫారెస్ట్ ఒత్తిడులు


మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్ళు పూర్తయినా ఇంకా రాజ్యాంగబద్దంగా ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో ప్రభుత్వాలు ఇంకా వెనకబడుతూనే ఉన్నాయి. ఆ గ్రామం ఏర్పడి 23 ఏళ్లు. అయినా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకు నోచుకోకుండా అంటరానివారిగా జీవిస్తూ,  విద్యుత్, త్రాగునీటి సౌకర్యాలకు, సంక్షేమ పథకాలకు దూరంగా, ఆధార్, రేషన్,ఓటర్ కార్డులలో గ్రామం పేరును మాత్రం ఉచ్చరిస్తూ, ఎన్నికల వేళ ఉచిత వాగ్దానాలతో ఓట్లు కోల్లగొట్టుకు పోవడం తప్ప ఎటువంటి అభివృద్ధి కి నోచుకోని గ్రామం అదే అశ్వారావుపేట మండలం లోని ఊట్లపల్లికి ఆనుకొని ఉన్న గ్రామం తిమ్మాపురం.ఈ గ్రామం గ్రామ పంచాయతీల పునర్విభజనకు ముందు ఆసుపాక గ్రామపంచాయతీలో ఉండేది పునర్విభజన తర్వాత ఆసుపాక గ్రామపంచాయతీ నుండి నూతనంగా ఏర్పడిన వేదాంతపురం గ్రామ పంచాయతీ లో విలీనం చేశారు.ఓటర్, ఆధార్, రేషన్ కార్డులలో తిమ్మాపురం గ్రామం పేరును కూడా జోడించారు. అనేక సార్లు క్రింది స్థాయి అధికారుల దగ్గర్నుండి, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పివో వరకు మాకు సంక్షేమ పథకాలు అమలు చేయండి మమ్ములను గుర్తించండి అని దరఖాస్తు లు సమర్పించియున్నారు. ఈ గ్రామంలో పాఠశాల,అంగన్వాడీ కేంద్రం కూడా ఉన్నాయి. ఈ గ్రామాన్ని గుర్తిస్తూ అప్పటి ఐటీడీఏ పీవో దివ్య ఆధ్వర్యంలో తీర్మానం కూడా చేయడం జరిగిందని, ప్రభుత్వం నుండి నీటి సౌకర్యం కోసం బోరు కూడా మంజూరు అయిందని, కరెంటు సౌకర్యం కూడా కల్పిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. అప్పటినుండి గ్రామపంచాయతీ లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినా తిమ్మాపురం గ్రామంలో మాత్రం వాటిని అమలు చేయడంలేదు.  ఇదేమిటని ప్రశ్నిస్తే అటవీశాఖ అధికారులు ఇది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది,ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని వారు చెబుతున్నారు.ఇటీవల ప్రభుత్వం మిషన్ భగీరద మంచినీటి సౌకర్యంలో భాగంగా గుంపులుగా నివసిస్తున్న గ్రామాలలో సోలార్ సిస్టం తో నడిచే వాటర్ ట్యాంక్ లకు ప్రాధాన్యతనిచ్చి ఏర్పాటు చేస్తున్నారు. అశ్వారావుపేట ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు, స్థానిక ఎంపీపీ ఆధ్వర్యంలో తిమ్మాపురం గ్రామంలో బోరు వేయుటకు ప్రయత్నించగా అటవీ శాఖాధికారులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు అదే బోరును వేరే రెవిన్యూకు చెందిన ప్రవేట్ వ్యక్తుల భూమిలో వేసి పైపు లైన్ ద్వారా నీళ్లిస్తామంటే తిమ్మాపురం గ్రామస్థులు బగ్గుమన్నారు.23 సంవత్సరాలుగా నివసిస్తున్న మా వూరిలో కాకుండా వేరే వారి భూమిలో బోరు వేయడమేంటి,దట్టమైన కీకారణ్యంలో నే ఈ సోలార్ సిస్టం తో నడిచే మంచినీటి పథకాన్ని ప్రవేశ పెడుతున్నారని వాటిని ఒప్పుకునే అటవీశాఖ అధికారులు, మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న తిమ్మాపురం గ్రామం లో బోరు వేసేందుకు ఎందుకు ఒప్పుకోవడం లేదో అర్థం కావడం లేదని,మా వూరిలో బోరు వేయించుకునే హక్కు మాకు లేదా, మంచినీటి పథకం మా వూరికే వచ్చింది కదా అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తున్నారని వేరే చోట వేసే బోరును అడ్డుకున్నారు. సమాధానం చెప్పలేని అధికారులు ఏమి చేయలేక వేనుదిరిగారు.అశ్వారావుపేట నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి వెంబడి ఊట్లపల్లికి సమీపంలో ఉన్న తిమ్మాపురం గ్రామం 23 సంవత్సరాలుగా పోడు భూములు సాగు చేసుకుంటూ గ్రామాన్ని ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు.ఈ గ్రామానికి ఆనుకొని పట్టా భూములు సైతం ఉన్నాయి. ఇటువంటి గ్రామాన్ని అటవీ శాఖధికారులు ఇది అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది, ఊరు కాళీ చేయాలనీ అనేకసార్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇళ్ళు పీకేస్తామంటున్నారని, కొత్త ఇళ్ళు కట్టుకొనివ్వడం లేదని, ఈ మధ్య కాలంలో ఈ ఒత్తిడులు తీవ్రతరం చేసారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా గ్రామం అటవీ పరిధిలో ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా గోబర్ గ్యాస్ కు ఎందుకు అనుమతులిచ్చారని, ఉపాధి హామీ పథకం ద్వారా రోడ్లు పనులు ఎందుకు చేయించారని, మా ఆధార్, ఓటర్ కార్డు లలో తిమ్మాపురం గ్రామం అని ఎందుకు వ్రాసారని  ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకొని రాజ్యాంగబద్ధంగా మాకు దక్కాల్సిన ప్రాథమిక హక్కులను మాకు కల్పించాలని, మా గ్రామానికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మాకు విద్యుత్ సౌకర్యం మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు అయిన బేతి నాగమ్మ, బేతి రమేష్, పద్దం చుక్కమ్మ,తెల్లం పుష్ప, బేతి ముత్తమ్మ, కరువుల జ్యోతి,  బేతి సీత, మల్లం వెంకమ్మ, సోయం చిలకమ్మ,మడపటి  జయలక్ష్మి, మడపటి  వెంకమ్మ, మంచు లక్ష్మి, నాగమణి, భూదేవి,బేతి పుల్లారావు, కొవ్వాసి వెంకటేష్, కొవ్వాసి రాజశేఖర్, రామదాసు, నాగేశ్వరరావు తదితరులుకోరుతున్నారు.

ఈ విషయమై ఉన్నతాధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరు.

Share it:

TELANGANA

Post A Comment: