CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లాలో రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం కావడం పట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి వైద్య సిబ్బందిని అభినందించారు

Share it:

 



మన్యం టీవీ భద్రాద్రి కొత్తగూడెం


 రెండవ విడత వాక్సినేషన్ ప్రక్రియ, అలాగే మంగళవారం నుండి ఎంపిక చేయబడిన 44 ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించనున్న వాక్సినేషన్ ప్రక్రియపై అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులతో సోమవారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఈ నెల 16వ తేదీన జిల్లాలో  ప్రారంభమైన ఈ కరోనా వాక్సినేషన్  ప్రక్రియకు ఎంపిక చేసిన  కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి,  పాత కొత్తగూడెంలోని పట్టణ హెల్త్ సెంటర్,  ఇల్లందు, భద్రాచలం తో పాటు  ప్రభుత్వం అదనంగా మరో పది కేంద్రాలలో  వ్యాక్సిన్ వేసేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వాటిలో ఈ రోజు చండ్రుగొండ,  దమ్మపేట, మంగపేట, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరు, చర్ల, దుమ్ముగూడెం, రేగళ్లలో వాక్సినేషన్ ప్రక్రియ  విజయవంతంగా జరిగినట్లు ఆయన చెప్పారు. అలాగే 19వ తేదీ  మంగళవారం నుండి ఎంపిక చేయబడిన 44 ఆరోగ్య కేంద్రాల్లో   మూడో విడత వాక్సినేషన్  ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. వాక్సిన్ వేసేందుకు ఎంపిక చేసిన సిబ్బంది వివరాలు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసినట్లు చెప్పారు. రెండో విడత ప్రక్రియలో ఎంపిక చేసిన ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ,  ఆరోగ్య, పారిశుద్ధ్య, సిబ్బంది 700 మందిని ఎంపిక చేశామని వారిలో  699 మందికి వ్యాక్సిన్  ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. వాక్సిన్ తీసుకున్న సిబ్బంది పై  ఎటువంటి దుష్ప్ర ప్రభావం జరగలేదని, వాక్సిన్  తీసుకున్న అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, వారందరినీ మనస్ఫూర్తిగా అభినందించారు. వాక్సిన్ ప్రారంభ కార్యక్రమంలో మొదటి విడతలో 120 మందికి, అలాగే  రెండో విడతలో 699 మందికి వాక్సిన్  ప్రక్రియ విజయవంతం కావడం పట్ల ప్రజల్లో ఉన్న ఆందోళన, భయం తొలగిపోయాయని సంతోషం వ్యక్తం చేశారు.  కరోనా మహమ్మారి నుంచి ప్రజలు సురక్షితంగా ఉండే రోజులు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఈ రోజు వ్యాధి నుండి మనమంతా సురక్షితంగా ఉండే రోజులు వచ్చాయని చెప్పారు. రేపటి నుండి ఎంపిక చేసిన 44 కేంద్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతున్నందుకు ప్రతి ఒక్కరికి ఆయన అభినందనలు తెలిపారు. భద్రం భద్రాద్రి తో మనం చేపడుతున్న అన్ని కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని ఇందులో బాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, అధికారులను, మీడియాను, జిల్లా ప్రజల యొక్క సహకారం, మమకారం ఎంతో అభినంద

నీయమన్నారు. ఇదే మిషన్ భద్రాద్రి లక్ష్యంతో ముందుకు పోదామని ఆయన చెప్పారు.

ఈ టెలి కాన్ఫెరెన్సులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, అనుదీప్,  జిల్లా వైద్యాధికారి డాక్టర్ భాస్కర్, ఇమ్యూనైజేషన్ అధికారి డా నాగేంద్ర ప్రసాద్, కరోనా సర్వేలెన్సు అధికారి డా చేతన్, ఉప వైద్యాధికారులు వినోద్, బావ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: