CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన సంవత్సరంని ఉద్దేశించి ప్రజలకు పోలీస్ ప్రకటన

Share it:

 




 మన్యంటివి,అశ్వారావుపేట: నూతన సంవత్సరం ని ఉద్దేశించి  అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్  మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా జరిగే వేడుకలను విషాదంగా మారకుండా తమ ఇంటి వద్దనే ప్రశాంతమైన వాతవారణంలో జరుపుకోవాలని అన్నారు.

- ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దేశం,రాష్ట్రం  కరోనా మహామ్మరి వైరస్ తో పోరాడుతుంది.

-కావున  ప్రజలు ఎవ్వరు కూడా రోడ్ల పైకి వచ్చి సంబరాలు జరుపుకొవొద్ధు..

-బయట ఎవరూ కూడా గుంపులు గుంపులుగా తిరగవద్దు..

-గత సంవత్సరం కంటే ఈ ఏడాది చాల వరకు ప్రమాదాలు తగ్గాయి.

-నిబంధనలు అతిక్రమించి డీజేలు వినియోగిస్తే సీజు చేస్తాం.

-మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడ్డ వారి పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తాం..

-నూతన సంవత్సర వేడుకల్లో ప్రతి సంవత్సరం మద్యం మత్తులో ఎంతో మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడమే కాకుండా ఇతరుల ప్రాణాలకు సైతం హాని కల్పించే విధంగా ర్యాష్ డ్రైవీంగ్ చేస్తున్నారు.

-మద్యం సేవించి రొడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణంగా మరల రోడ్డు ప్రమాదాలలో ఎవరూ ప్రాణాలను కొల్పోకుండా చూడడం, ప్రజలకు సమర్ధవంతమైన సేవలందించడమే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం.

-ఈ న్యూయర్ వేడుకలు మొత్తం పూర్తిగా పోలీస్ పెట్రోలీంగ్, అన్ని ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం..

-ఈ వేడుకలను సజావుగా జరుపుకునే వారికి పోలీస్ సహకారం ఉంటుంది.

-ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం.. అని వారు తెలిపారు..

Share it:

TELANGANA

Post A Comment: